ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా నిర్వహిస్తున్న సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా చేపట్టిన ‘సేవాజ్యోతి యాత్ర’ బైక్ ర్యాలీని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే & టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు గళ్ళా మాధవి బుధవారం ఘనంగా ప్రారంభించారు. దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు నిర్వహిస్తున్న సేవా సంకల్ప్ అభియాన్ ప్రధాని మోదీ 25 ఏళ్ల ప్రజాసేవను గుర్తు చేస్తూ చేపట్టిన కార్యక్రమం తెలుగుయువత, టీఎన్ఎస్ఎఫ్ నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ బైక్ ర్యాలీని శ్రీనివాసరావుపేటలోని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే గళ్ళా మాధవి సేవాజ్యోతిని వెలిగించి ప్రారంభించారు. అనంతరం యువతతో కలిసి బైక్ ర్యాలీలో పాల్గొన్నారు.టీడీపీ కార్యాలయం నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ నగరంలోని ప్రధాన వీధుల గుండా లక్ష్మీపురంలోని మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహం వరకు కొనసాగింది. యువత పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వానికి మద్దతు తెలుపుతూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గళ్ళా మాధవి మాట్లాడుతూ.. దేశాభివృద్ధి, సుపరిపాలన, సేవా తత్వానికి ప్రతీకగా నిలిచిన ప్రధాని నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవ ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని, దేశాన్ని అభివృద్ధి చెందిన భారతంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో మోదీ నిరంతరం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం సహాయ సహకారాలు అందిస్తున్న నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వానికి ఎమ్మెల్యే గళ్ళా మాధవి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుయువత, టీఎన్ఎస్ఎఫ్ నాయకులు, ఎన్డీయే కూటమి నాయకులు, పార్టీ కార్యకర్తలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు
GUNTUR CITY NEWS: మోదీ ప్రజాసేవకు 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సేవాజ్యోతి యాత్ర

Sign Up For Daily Newsletter
Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Leave a review Leave a review
Stay Connected
Weather
28°C
Vijayawada
overcast clouds
28° _ 28°
81%
4 km/h
Thu
30 °C
Fri
28 °C
Sat
29 °C


