GUNTUR DISTRICT NEWS: CEC వెంటనే రాజీనామా చేయాలి

Karthik

బీజేపీ ప్రభుత్వానికి తొత్తుగా వ్యవహరిస్తున్న కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ తక్షణమే రాజీనామా చేయాలని విద్యార్థి, యువజన సంఘాలు డిమాండ్ చేశారు. గురువారం గుంటూరు అంబేద్కర్ సర్కిల్ సెంటర్ వద్ద ఇందులో జరుగుతున్న జెన్-జీ ఉద్యమానికి మద్దతుగా AISF, AIYF, SFI, DYFI, NSUI ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా యువజన సంఘాల నాయకులు, వలీ, కరీం,‌ కృష్ణకాంత్, చైతన్య విద్యార్థి యువజన సంఘాల నేతలు మాట్లాడుతూ ప్రజల ఓటును తీసేసే హక్కు జ్ఞానేష్ కుమార్ కు ఎవరిచ్చారని ప్రశ్నించారు. బీజేపీ పాలనలో ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేక ఆటవిక రాజ్యంలో ఉన్నామా అనే సందేహం కలుగుతుందన్నారు. సిఇసి తక్షణమే వైదొలగాలి అని డిమాండ్ చేశారు. ఏకంగ ముగ్గురు ముఖ్యమాత్రులను స్టాలిన్, క్రేజీవాల్, మమతా బెనర్జీ లను ఓడించడానికి వారి నియోజక వర్గాల్లో లక్షలాది ఓట్లను తొలగించారని అన్నారు. ఒక వైపు దేశ జనాభా 140 కోట్లకు చేరుకుంది అని ప్రభుత్వం చెప్తే,ఓట్ల శాతం పెరగలే కానీ తగ్గడం దేనికి సంకేతం అని అన్నారు. మరోవైపు సవరించిన ఫామ్ 6 సుప్రీం కోర్టు సమర్థించింది అని అబద్ధాలతో ఎన్నికల కమిషన్ విలువ లేకుండా చేశారని విమర్శించారు.

Author
Share This Article
Leave a review