Krishna district City News :గుడివాడ అభివృద్ధి పనులకు వేగం పెంచాలి-ఎమ్మెల్యే వెనిగండ్ల రాము

S Sarath
1 View

గుడివాడ:– గుడివాడ పట్టణంలో మంజూరైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల పనుల పురోగతిపై ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అధికారులతో సమీక్ష నిర్వహించారు. గురువారం ఉదయం గుడివాడ మున్సిపల్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో తాగునీరు, డ్రైనేజీ, సీవరేజ్, వాటర్ డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్ తదితర మౌలిక వసతులపై చర్చించారు.

మున్సిపల్ కమిషనర్ సింహాద్రి మనోహర్, పబ్లిక్ హెల్త్, ఏపీ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ అధికారులు, ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ మానిటరింగ్ కమిటీ నిపుణులు, మెగా సంస్థ ప్రతినిధులు, మున్సిపల్ ఇంజనీర్లు సమావేశంలో పాల్గొన్నారు.

తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం

గుడివాడ పట్టణంలో చేపట్టనున్న వాటర్ వర్క్స్, నూతన పైప్‌లైన్లు, వాటర్ డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్ పనులపై ఎమ్మెల్యే రాము అధికారులతో సమీక్షించారు. పట్టణంలోని అన్ని ప్రాంతాలకు సమర్థవంతంగా తాగునీరు సరఫరా అయ్యేలా రూపొందించిన సమగ్ర డిజైన్‌ను పీడీఎంఎస్ నిపుణులు టి.ఆంజనేయులు వివరించారు.

పట్టణ విస్తరణ, భవిష్యత్ జనాభా పెరుగుదలను దృష్టిలో ఉంచుకుని తాగునీటి వసతులను అభివృద్ధి చేయాలని ఎమ్మెల్యే సూచించారు. గుడివాడ మున్సిపాలిటీలో విలీనమైన గ్రామాలకు కూడా నాణ్యమైన తాగునీరు అందేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు అధికారులు తెలిపారు.Krishna district news

రాబోయే 30 ఏళ్లలో గుడివాడ పట్టణంలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా సమగ్ర ప్రణాళిక రూపొందిస్తున్నట్లు ఎమ్మెల్యే రాము తెలిపారు. ప్రస్తుతం ఉన్న జనాభాతో పాటు భవిష్యత్‌లో పెరిగే జనాభా, కొత్తగా అభివృద్ధి చెందే ప్రాంతాలను పరిగణనలోకి తీసుకుని సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు, ఓవర్‌హెడ్ వాటర్ ట్యాంకులు, డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్‌లను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు.

రూ.22.50 కోట్లతో అమృత్‌ 2.0 పనులు

గుడివాడ పట్టణంలో తాగునీటి వసతుల మెరుగుదలకు అమృత్‌ 2.0 కింద రూ.22.50 కోట్ల నిధులు మంజూరైనట్లు ఎమ్మెల్యే తెలిపారు. ప్రభుత్వ సెంటు స్థలాల ఎన్టీఆర్ కాలనీలో వాటర్ ట్యాంక్ నిర్మాణం, డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్ పనులకు రూ.10.90 కోట్ల నిధులు మంజూరయ్యాయని చెప్పారు.

అదేవిధంగా సీవరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థల అభివృద్ధికి మరో రూ.36 కోట్ల నిధులు మంజూరైనట్లు వెల్లడించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో గుడివాడలో పలు అభివృద్ధి పనులు వివిధ దశల్లో కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.

సాంకేతిక సమస్యలకు ముందుగానే పరిష్కారం

బేతవోలు, నాగవరప్పాడు చెరువుల ఆధునీకరణ పనుల్లో ఎదురవుతున్న సాంకేతిక సమస్యలను అధికారులు, పీడీఎంఎస్ నిపుణులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపిన తర్వాత పనులను వేగంగా చేపట్టాలని రాము సూచించారు.

రైల్వే గేట్ల వద్ద పైప్‌లైన్ పనులకు ఎలాంటి అంతరాయం కలగకుండా ముందుగానే సమగ్ర ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే ప్రారంభించిన సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు, భవిష్యత్‌లో నిర్మించనున్న ఓవర్‌హెడ్ ట్యాంకులు, డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్ తదితర పనుల పురోగతిని అధికారులు వివరించారు.

నిధులు మంజూరైనప్పటికీ కొన్ని సాంకేతిక, స్థానిక సమస్యల కారణంగా పనుల్లో జాప్యం జరుగుతోందని ఎమ్మెల్యే తెలిపారు. పనులు ప్రారంభించిన తర్వాత మధ్యలో ఎలాంటి అవరోధాలు లేకుండా నిరంతరాయంగా కొనసాగించడమే లక్ష్యమన్నారు. అందుకోసం పనులు ప్రారంభించే ముందే ఎదురయ్యే సమస్యలను గుర్తించి పరిష్కరించాలని సూచించారు.

సమగ్ర అభివృద్ధే లక్ష్యం

గుడివాడ పట్టణ సమగ్ర అభ్యున్నతికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో పాటు అందుబాటులో ఉన్న ఇతర వనరులను కూడా పూర్తిస్థాయిలో వినియోగిస్తున్నామని రాము తెలిపారు. తాగునీరు, డ్రైనేజీ, సీవరేజ్, రోడ్లు తదితర మౌలిక వసతులను సమగ్రంగా అభివృద్ధి చేసి భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా గుడివాడను తీర్చిదిద్దడమే లక్ష్యమని చెప్పారు.

సమీక్షలో ఏపీ స్టేట్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, పబ్లిక్ హెల్త్ ఈఈ ప్రవీణ్, డీఈ పాండురంగ, మున్సిపల్ ఎంఈ సతీష్ చంద్ర, ఏపీజీబీసీ జోనల్ మేనేజర్ బేబీ, డీఈ రాజేంద్రప్రసాద్, ఏఈ కిషోర్, జనసేన ఇన్‌చార్జ్ బూరగడ్డ శ్రీకాంత్, టీడీపీ అధ్యక్షుడు పండ్రాజు సాంబయ్య, నాయకులు లింగం ప్రసాద్, రామిదేని వేణుబాబు, బొంబాయి శీను, కంచర్ల సుధాకర్, మెగా సంస్థ మేనేజర్ పాండియన్, పీడీఎంఎస్ నిపుణులు, మున్సిపల్ ఏఈలు పాల్గొన్నారు.

Author
Share This Article
Leave a review