భారతీయ కరెన్సీ నోట్లతో అలంకరించిన స్వామివారి దివ్యమంగళ రూపం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. స్వామివారిని దర్శించుకున్న భక్తులు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు.
ఈ సందర్భంగా అర్చక స్వామి భార్గవ్ మాట్లాడుతూ.. ఈ నెల 11వ తేదీ నుంచి 21వ తేదీ వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. బ్రహ్మోత్సవాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు.


బాపట్ల: బాపట్ల పాత బస్టాండ్ వద్ద కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామివారు శనివారం భక్తులకు విశేష అలంకరణలో దర్శనమిచ్చారు. శనివారం పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయ అర్చకులు, నిర్వాహకులు స్వామివారిని రూ.500, రూ.200, రూ.100 కరెన్సీ నోట్లతో సుందరంగా అలంకరించారు.About Us
SUBSCRIBE TO BAPATLA CITY NEWS YOUTUBE CHANNEL FOR DAILY NEWS UPDATES



