చిన్నగంజాం, బాపట్ల జిల్లా: రానున్న స్థానిక ఎన్నికల దృష్ట్యా చినగంజాం మండలంలోని సంతరావూరు గ్రామంలో ఆదివారం ఉదయం ఇన్స్పెక్టర్ ఆదేశాల మేరకు పోలీస్ సిబ్బంది ఇంటింటా సర్వే నిర్వహించారు. ఎన్నికలు ప్రశాంతంగా జరగాలని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ప్రజలు సహకరించాలని సూచించారు.


గ్రామంలోని ఓటర్లు ఎన్నికల సమయంలో అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పోలీసులు అవగాహన కల్పించారు. గ్రామంలోని యువత, మహిళలు ఒకే ప్రాంతంలో సమావేసమై ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా సహకరించాలని తెలిపారు.About Us
ఈ కార్యక్రమంలో ఇన్చార్జి ఎస్ఐ రామానాయక్, ఎస్ఐ సురేష్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
SUBSCRIBE TO BAPATLA CITY NEWS YOUTUBE CHANNEL FOR DAILY NEWS UPDATES



