దర్శి:– మున్సిపల్ ఎన్నికలకు పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని దర్శి ఎమ్మెల్యే, ప్రకాశం జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అన్నారు. ఆదివారం దర్శి పట్టణంలోని పొదిలి రోడ్డులో ఉన్న వైఎస్సార్సీపీ పార్టీ కార్యాలయంలో దర్శి మున్సిపాలిటీ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ.. మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ రెండు, మూడు రోజుల్లో వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. నోటిఫికేషన్ వెలువడే సమయానికి దర్శి మున్సిపాలిటీలోని 28 వార్డుల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను సిద్ధంగా ఉంచుకోవాలని పార్టీ నాయకులకు సూచించారు. దర్శి మున్సిపాలిటీ ఎన్నికలు పార్టీకి కీలకమని, నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తూ ఎన్నికల సన్నాహాలను వేగవంతం చేయాలని అన్నారు.
పార్టీ నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా పనిచేసి మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
వైఎస్సార్సీపీ రాష్ట్ర సీఈసీ సభ్యురాలు బూచేపల్లి వెంకాయమ్మ మాట్లాడుతూ.. దర్శి మున్సిపాలిటీలో పార్టీ అభ్యర్థులను గెలిపించి వైఎస్ జగన్మోహన్రెడ్డికి కానుకగా అందించాలని అన్నారు.Markapuram District City News :ఉచిత కుట్టు మిషన్ల పంపిణీ- ఆర్థిక స్వాలంబనకు బాటలు వేస్తున్న “జననీ చారిటబుల్ ట్రస్ట్”
ఈ సమావేశంలో మండల పార్టీ అధ్యక్షుడు వెన్నపూస వెంకటరెడ్డి, మాజీ ఎంపీపీలు, మాజీ జడ్పీటీసీలు, దర్శి పట్టణ కౌన్సిలర్లు, వివిధ వార్డులకు చెందిన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.



