GUNTUR DISTRICT NEWS: కాంట్రాక్టర్ల‌ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తాం

Karthik

సబ్కా గుంటూరు, ప్రకాశం జిల్లాల యూనిట్ సర్వసభ్య సమావేశం గుంటూరులో జరిగింది. ఇందులో భాగంగా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.‌ నూతన అధ్యక్షుడుగా కె. వెంకట్రావు,ప్రధానకార్యదర్శి ఎన్. భూపేంద్ర సిన్హా,ట్రెజరర్ ఎం. గంగయ్య లను ఏకాంతంగా ఎన్నుకున్నారు. స్టేట్ కమిటీ పర్యవేక్షణలో ఎన్నిక ప్రక్రియ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రతినిధులు సతీష్, రమేష్, శివకుమార్, శ్రీనివాసరావు, అప్పారావు, వెంకటేశ్వర శాస్త్రి తదితరులు పాల్గొని నూతన కార్యవర్గాన్ని సత్కరించి అభినందించారు. కాంట్రాక్టర్లకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా అసోసియేషన్ దృష్టికి తీసుకు రావాలని తెలిపారు. వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని వారు వెల్లడించారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా అసోసియేషన్ ని మరింత బలోపేతం చేసి కాంట్రాక్టర్ల సంక్షేమానికి కృషి చేయడం జరుగుతుందని చెప్పారు.

Author
Share This Article
Leave a review