విజయవాడ:-రాష్ట్రంలో రెండవ సాధారణ పురపాలక ఎన్నికల (2026) వేడి మొదలైంది. ఎన్నికల నిర్వహణలో కీలక ఘట్టమైన రిజర్వేషన్ల ప్రక్రియ వేగవంతమైంది. సీడీఎంఏ (CDMA) జారీ చేసిన ఉత్తర్వుల మేరకు విజయవాడ నగరపాలక సంస్థ (VMC) పరిధిలో మేయర్ పదవితో పాటు వివిధ వార్డుల రిజర్వేషన్ల వివరాలను అధికారులు అధికారికంగా వెల్లడించారు.
తాజా కేటాయింపుల ప్రకారం విజయవాడ మేయర్ స్థానాన్ని ‘అన్రిజర్వ్డ్ జనరల్’ (Unreserved General) గా ఖరారు చేశారు.
విజయవాడ కార్పొరేషన్ వార్డుల రిజర్వేషన్లు ఇలా:
విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలోని డివిజన్లలో కేటాయించిన వర్గాల వారీ రిజర్వేషన్ల వివరాలు:
- ఓసీ (జనరల్): 22 స్థానాలు
- ఓసీ (మహిళ): 21 స్థానాలు
- బీసీ (జనరల్): 16 స్థానాలు
- బీసీ (మహిళ): 15 స్థానాలు
- ఎస్సీ (జనరల్): 05 స్థానాలు
- ఎస్సీ (మహిళ): 05 స్థానాలు
- ఎస్టీ (జనరల్): 01 స్థానం
- ఎస్టీ (మహిళ): 01 స్థానం
రేపటితో తేలనున్న వార్డుల కేటాయింపు:
ఏ డివిజన్/వార్డు ఏ కేటగిరీ కిందకు వస్తుందనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా వార్డుల వారీ కేటాయింపు నివేదికను తయారు చేసి, అక్టోబర్ 13, 2026 నాటికి సీడీఎంఏ అధికారులకు సమర్పించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించినట్లు విజయవాడ నగరపాలక సంస్థ పౌర సంబంధాల అధికారి (PRO) తెలిపారు.Vijayawada city news
రిజర్వేషన్ల ప్రకటనతో విజయవాడ నగరంలో రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారనున్నాయి. ప్రధాన పార్టీలలో టికెట్లు ఆశిస్తున్న అభ్యర్థులు తమ తమ వార్డుల రిజర్వేషన్ ఖరారు కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.



