Prakasam District City News :దర్శి పట్టణానికి తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం-దాదాపు 8 వేల ఇంటింటి కుళాయిల ఏర్పాటు – డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి

S Sarath
1 View

దర్శి:– పట్టణ ప్రజలకు తాగునీటి కష్టాలు లేకుండా శాశ్వత పరిష్కారం చూపడమే లక్ష్యంగా రూ.120 కోట్లతో అమృత్ 2.0 పథకం పనులను బుధవారం దర్శి పట్టణంలో ప్రారంభించారు. దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు, టీడీపీ యువ నాయకుడు డాక్టర్ కడియాల లలిత్ సాగర్, మున్సిపల్ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య, దర్శి మండల ఏఎంసీ చైర్మన్ దారం నాగవేణి, జిల్లా మున్సిపల్ ఈఈ సంజయ్ శ్రీనివాస్, డీఈ విజయలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ కె. అర్జున్ రావు, ఏఈ బ్రహ్మారెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ.. దర్శి పట్టణ ప్రజలకు అమృత్ 2.0 పథకం ప్రారంభం ఎంతో సంతోషకరమైన విషయమని అన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ సహకారంతో ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీరు అందించే కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు.

దర్శి పట్టణంలోని వివిధ వార్డుల్లో ప్రజలు తాగునీటి కోసం పడుతున్న ఇబ్బందులను గుర్తించి, సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. రూ.120 కోట్లతో అమలు చేస్తున్న ఈ పథకం ద్వారా పట్టణ ప్రజలకు తాగునీటి సమస్య నుంచి ఉపశమనం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పథకంలో భాగంగా దాదాపు 8 వేల ఇంటింటి కుళాయిలను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.

పులిపాడు చెరువు విస్తరణ పనులతో పాటు అమృత్ 2.0 పథకం ద్వారా ప్రతి ఇంటికీ కుళాయి కనెక్షన్ అందించి తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. తాగునీటి వసతులు మెరుగుపడటంతో పాటు పట్టణంలో మౌలిక సదుపాయాలు అభివృద్ధి చెందుతాయని అన్నారుPrakasam district news.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దర్శి పట్టణంలో రోడ్లు, డ్రైనేజీ అభివృద్ధి కోసం సుమారు రూ.20 కోట్ల విలువైన పనులు చేపట్టినట్లు డాక్టర్ లక్ష్మి వివరించారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో రోడ్లు, డ్రైనేజీలు, తాగునీరు, సాగునీటి సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం అభివృద్ధి పనులు చేపడుతోందన్నారు. దర్శి నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి పనులను పూర్తి చేసినట్లు తెలిపారు.

గత ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వ హయాంలో అమృత్ పథకం పనులు ముందుకు సాగలేదని డాక్టర్ లక్ష్మి విమర్శించారు. కూటమి ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని పనులు ప్రారంభించిందని పేర్కొన్నారు. దర్శి పట్టణ అభివృద్ధికి మౌలిక సదుపాయాల కల్పన కీలకమని, ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి కొనసాగుతుందని తెలిపారు.

అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజలు సహకరించాలని కోరిన డాక్టర్ లక్ష్మి, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో దర్శి మండల, పట్టణ టీడీపీ అధ్యక్షులు మారెళ్ల వెంకటేశ్వర్లు, పుల్లలచెరువు సత్యనారాయణ, మున్సిపల్ వైస్ చైర్మన్ తలారి కోటయ్య, క్లస్టర్ ఇన్‌చార్జి నారపుశెట్టి మధు, నీటి సంఘం డీసీ అధ్యక్షుడు వెలిగొండారెడ్డి, కౌన్సిలర్లు నక్కా రంగా, చంద్ర, వి.సి. రెడ్డి, ఉగ్గు పవన్, కనకం శ్రీను, యాదగిరి వాసు, కర్ణ శ్రీను, పటాన్ సుభాని, బుజ్జి, టీడీపీ నాయకులు, కూటమి శ్రేణులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

Author
Share This Article
Leave a review