GUNTUR DISTRICT NEWS: సరస్వతీ దేవికి భక్తిశ్రద్ధలతో పూజలు

Karthik

దసరా మహోత్సవాలు గుంటూరులో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా మూలా నక్షత్రం పురస్కరించుకొని శుక్రవారం సరస్వతీ దేవి రూపంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. అదేవిధంగా చిన్నారులకు అక్షరాభ్యాసం చేశారు. చిన్నారులు తమ చదువులో మంచి ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. సరస్వతీ దేవికి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించి దైవదర్శనం గావించారు. శ్రీ దేవీ శరన్నవరాత్రి మహోత్సవాల్లో అమ్మవారిని దర్శించుకున్న వారికి సకల శుభాలు కలుగుతాయని పండితులు తెలిపారు.

Author
Share This Article
Leave a review