Bapatla Distric news :మహిళల రక్షణకు ‘శక్తి యాప్’ ఒక వరం- పర్చూరు ఎస్సై పులి గోపి

Sharat
1 View

బాపట్ల జిల్లా (పర్చూరు): – మహిళలు, బాలికల రక్షణ కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన ‘శక్తి యాప్ 112’ సేవలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని పర్చూరు సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎస్సై) పులి గోపి పిలుపునిచ్చారు.

బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గ కేంద్రమైన పర్చూరు గ్రామంలోని అద్దంకి నాంచారమ్మ కళ్యాణ మండపంలో మహిళలు, విద్యార్థినులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై పులి గోపి మాట్లాడుతూ, సమాజంలో మహిళలు, బాలికలు ఎదుర్కొంటున్న వేధింపులకు, సమస్యలకు తక్షణ పరిష్కారం చూపేందుకు ఈ యాప్ ఎంతగానో దోహదపడుతుందని పేర్కొన్నారు.

తక్షణ పోలీస్ సేవలు మీ చెంతనే..

ఏదైనా ఆపద లేదా వేధింపులు ఎదురైనప్పుడు మహిళలు అధైర్యపడకుండా, తక్షణమే శక్తి యాప్ ద్వారా పోలీసులకు సమాచారం అందించాలని ఆయన సూచించారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు స్పందించి, బాధితులకు రక్షణ కల్పిస్తారని భరోసా ఇచ్చారు. ముఖ్యంగా కాలేజీ విద్యార్థినులు, ఉద్యోగిణులు, స్థానిక మహిళలు ప్రతి ఒక్కరూ తమ స్మార్ట్‌ఫోన్లలో ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలని కోరారు.

“మహిళల భద్రతే ధ్యేయంగా పోలీసులు నిరంతరం శ్రమిస్తున్నారు. ఆపదలో ఉన్నప్పుడు ‘శక్తి యాప్ 112’ సేవలను ఉపయోగించుకుని మిమ్మల్ని మీరు రక్షించుకోవడంతో పాటు, పోలీసుల సహాయాన్ని త్వరితగతిన పొందవచ్చు.”పులి గోపి, పర్చూరు ఎస్సై

ఈ అవగాహన కార్యక్రమంలో స్థానిక మహిళలు, కాలేజీ విద్యార్థినులు, గ్రామ పెద్దలు మరియు పోలీస్ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Author
Share This Article
Leave a review