మచిలీపట్నం (కృష్ణా జిల్లా):– నగరంలో ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రశాంతంగా ప్రారంభమైంది. ఇందులో భాగంగా నగరంలోని పలు డివిజన్లలో, ముఖ్యంగా స్వర్ణ వార్డు భవనంలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డీకే బాలాజీ శనివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు.Krishna district news
ఈ సందర్భంగా నామినేషన్ల స్వీకరణ తీరుతెన్నులను అధికారులను అడిగి తెలుసుకున్నారు. నామినేషన్ల ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లు లేదా సాంకేతిక లోపాలు తలెత్తకుండా నిబంధనల ప్రకారం అత్యంత పారదర్శకంగా నిర్వహించాలని అధికారులను ఆయన కఠినంగా ఆదేశించారు. అభ్యర్థులకు, వారి ప్రతిపాదకులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగిన సౌకర్యాలు కల్పించాలని సూచించారు.



