ఉపాధి హామీ ప్రదేశాల్లో ముమ్మరంగా స్వీయ గణన కార్యక్రమం మంగళవారం ముమ్మరంగా సాగింది. జిల్లా ప్రిన్సిపాల్ సెన్సస్ అధికారి మరియు జిల్లా కలెక్టర్ సి.యం.సాయి కాంత్ వర్మ ఆదేశాలతో ఉపాధి హామీ ప్రదేశాల్లో శిక్షణ పొందిన ఉద్యోగులతో వేతనదారుల స్వీయ గణన చేపట్టారు. ఈ మేరకు మంగళవారం జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రజలు తమ వివరాలను తామే స్వయంగా ఆన్‌లైన్ పోర్టల్ (https://se.census.gov.in) ద్వారా ఏప్రిల్ 30వ తేదీ వరకు స్వీయ గణన చేసుకునే అవకాశం ఉందని జిల్లా కలెక్టర్ చెప్పారు. వేతనదారులకు స్వయంగా ఆన్ లైన్ లో స్వీయ గణన చేసుకునే పరిజ్ఞానం ఉండే అవకాశం లేనందున ప్రతి మండలంలో ఉపాధి హామీ పనులు జరిగే ప్రదేశాల్లో స్వీయ గణనకు శిక్షణ పొందిన సిబ్బందిని, స్వర్ణ గ్రామ కార్యాలయ సిబ్బందిని మ్యాపింగ్ చేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు. మంగళ వారం నాటికి జిల్లాలో గల ఉపాధి వేతనదారుల స్వీయ గణన పూర్తి కావాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం గుంటూరు మండలం లింగాయపాలెంలో జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ వి.శంకర్, ఫిరంగిపురం మండలం తాళ్లూరులో జిల్లా పరిషత్ ఉప ముఖ్య కార్యనిర్వహణ అధికారి సి. హెచ్ కృష్ణ, ఇతర అధికారులు వారి మండలాల్లో పర్యటిస్తూ స్వీయ గణన ముమ్మరంగా జరిగి జిల్లా ఆదర్శంగా నిలుచుటకు చర్యలు చేపడుతున్నారు. మంగళవారం సాయంత్రం నాలుగు గంటల నాటికి 22,215 మందికి స్వీయ గణన పూర్తి చేసి రాష్ట్రంలో మూడవ స్థానంలో నిలిచింది.
GUNTUR DISTRICT NEWS: ఉపాధి హామీ ప్రదేశాల్లో ముమ్మరంగా స్వీయ గణన

Sign Up For Daily Newsletter
Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Leave a review Leave a review
Stay Connected
Weather
32°C
Vijayawada
light rain
32° _ 32°
66%
5 km/h
Thu
37 °C
Fri
38 °C
Sat
35 °C


