GUNTUR CITY NEWS: గుంటూరు తూర్పు నియోజకవర్గంలో వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమం

Karthik

గుంటూరు తూర్పు నియోజకవర్గంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. గుంటూరు నగర అధ్యక్షురాలు, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త షేక్ నూరీ ఫాతిమా ఆధ్వర్యంలో తూర్పు నియోజకవర్గ పరిధిలోని పలు డివిజన్లలో వైయస్సార్ విగ్రహాలకు, చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పలు సేవా కార్యక్రమాలను చేపట్టి ప్రజల పట్ల వైయస్సార్ ఆశయాలను మరోసారి గుర్తు చేసుకున్నారు.డివిజన్ల వారీగా విస్తృతంగా సేవా కార్యక్రమాలు నిర్వహించారు. అదేవిధంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తూర్పు నియోజకవర్గ కార్యాలయంలో వైయస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి, ప్రత్యేకంగా మెడికల్ క్యాంపు నిర్వహించారు.

Author
Share This Article
Leave a review