GUNTUR CITY NEWS: గుంటూరు 30వ డివిజన్ లో వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమం

Karthik

మహానేత ఆరోగ్యశ్రీ ప్రదాత దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతిని గుంటూరు 30వ డివిజన్ లో నిర్వహించారు‌. వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఫ్రూట్స్ పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్, డివిజన్ అధ్యక్షులు అచ్చాల వెంకటరెడ్డి, గుంటూరు జిల్లా డాక్టర్ సెల్ అధ్యక్షులు డాక్టర్ రవి, ఈవూరి వనజాక్షి, కాండ్రకొండ కోటయ్య, లక్ష్మి రెడ్డి, రామిరెడ్డి, సీతారామిరెడ్డి, మరియు 30వ డివిజన్ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. అదేవిధంగా మహిళలు, కార్యకర్తలు అందరూ పాల్గొని మహానేతకి ఘనంగా నివాళులర్పించడం జరిగింది.

Author
Share This Article
Leave a review