విజయవాడ:– విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సన్నద్ధతపై కూటమి నేతలు దృష్టి సారించారు. ఇందులో భాగంగా స్థానిక ఎన్టీఆర్ భవన్లో జిల్లా అధ్యక్షురాలు గద్దె అనురాధ అధ్యక్షతన కీలకమైన సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశానికి విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), జిల్లా ఎన్నికల ఇన్చార్జ్, జీడీసీసీ బ్యాంకు చైర్మన్ మల్లికార్జునరావు, తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహనరావు, సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ, నాయకులు బుద్ధా వెంకన్న తదితరులు హాజరయ్యారు.
అలాగే, ఈ సమావేశంలో కూటమి భాగస్వామ్య పక్షాలైన జనసేన మరియు బీజేపీ నేతలు కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు. జనసేన ముఖ్య నేత వంగవీటి రాధాకృష్ణ, సామినేని ఉదయభాను తో పాటు పలువురు బీజేపీ నాయకులు ఈ భేటీకి విచ్చేసి ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు.Vijayawada City News
రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో అనుసరించాల్సిన ప్రణాళికలు, కూటమి విజయమే లక్ష్యంగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై నేతలు దిశానిర్దేశం చేశారు.



