GUNTUR DISTRICT NEWS: ఈనెల 21న పోలీసు అమరవీరుల దినోత్సవం

Karthik

పోలీసు అమరవీరుల దినోత్సవం ఈ నెల 21వ తేదీన జరగనుంది. మంగళగిరి 6వ ఏపిఎస్పీ బెటాలియన్ మైదానంలో నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమ ఏర్పాట్లను జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, పోలీస్ సూపరింటెండెంట్ వకుల్ జిందాల్ సోమవారం తనిఖీ చేశారు. అతిథులు, పోలీసు అమరవీరుల కుటుంబాలు పాల్గొననున్నాయి. అవసరమగు వేదిక, కూర్చునే సదుపాయాలు ఏర్పాటు చేయాలని సూచించారు. వైద్య శిబిరాలు, తాగు నీరు, మరుగుదొడ్లు ఏర్పాటు ఉండాలని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎ.టి.వి రవి కుమార్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి మక్కెన పద్మావతి, పోలీసు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

Author
Share This Article
Leave a review