ఏలూరు:- ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో 30వ డివిజన్లో కూటమి నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచార కార్యక్రమంలో ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాథాకృష్ణయ్య (చంటి), మేయర్ అభ్యర్థి రెడ్డి అప్పలనాయుడు, 30వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి కొండె రాణి నిర్మలాకుమారి పాల్గొన్నారు.
జనసేన నాయకుడు నారా శేషు, మాజీ కోఆప్షన్ సభ్యుడు ఎస్ఎంఆర్ పెద్దబాబు, ఏలూరు మాజీ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ బొద్దాని శ్రీనివాస్‌తో పాటు కూటమి నాయకులు ప్రచారంలో పాల్గొని ప్రజలను కలిశారు.
డివిజన్లోని ప్రజలతో మమేకమవుతూ ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.



