GUNTUR CITY NEWS: ప్రజల ఆకాంక్షలే ప్రాధాన్యం.. లక్ష్మీ అపర్ణ

Karthik

గుంటూరు నగరంలోని 59వ డివిజన్‌లో మాదాల చైతన్య ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో కూటమి అభ్యర్థి లక్ష్మి అపర్ణ పాల్గొన్నారు. నగర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా గుంటూరు సమగ్ర అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తానని కూటమి మేయర్ అభ్యర్థి కోవెలమూడి లక్ష్మీ అపర్ణ హామీ ఇచ్చారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ, నగరంలోని మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తానని తెలిపారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని 59వ డివిజన్ సుగాలి కాలనీలో మాదాల చైతన్య ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా నగరాభివృద్ధికి కూటమి నాయకత్వం చేస్తున్న కృషిని వివరిస్తూ, రానున్న రోజుల్లో ప్రజలకు మరింత మెరుగైన సదుపాయాలు కల్పించేందుకు సమష్టిగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఆశీస్సులతో, కేంద్ర మంత్రి పేమ్మసాని చంద్రశేఖర్,ఎమ్మెల్యేలు గల్లా మాధవి, నసీర్ అహ్మద్.బుర్ల రామ ఆంజనేయులు మార్గదర్శకత్వంలో నగర అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని పేర్కొన్నారు. రహదారులు, డ్రైనేజీ వ్యవస్థ, పారిశుధ్యం వంటి మౌలిక సదుపాయాల మెరుగుదలకు ప్రాధాన్యమిస్తూ ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి మాట్లాడుతు. గతంలో ప్రభుత్వం హయం లో రాష్ట్రాన్ని వెనుకబాటుకు గురిచేసిందని గల్లా మాధవి పేర్కొన్నారు. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలకు మించి సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగుతోందన్నారు. అమరావతి రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు, సాగు, తాగునీటి వ్యవస్థల అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారం అభినందనీయమని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ సహకారం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వం, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నిబద్ధతతో రాష్ట్ర అభివృద్ధి ముందుకు సాగుతోందని తెలిపారు. 59వ డివిజన్ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం :59వ డివిజన్‌లో గతంలో వర్షాకాలంలో ముంపు సమస్యలు, రహదారుల దుస్థితి, డ్రైనేజీ సమస్యలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని గల్లా మాధవి తెలిపారు. ఇటీవలి కాలంలో డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచడం, రహదారుల అభివృద్ధి, పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించడంతో పరిస్థితులు మెరుగుపడ్డాయని చెప్పారు. కార్యక్రమంలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు, పోలిట్ బ్యూరో సభ్యురాలు గళ్ళా మాధవి, గుంటూరు నగర మేయర్ కూటమి అభ్యర్థి లక్ష్మీ అపర్ణ కోవెలమూడి, 59వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి పేరం శ్రీనివాసరావు, గుంటూరు జిల్లా టిడిపి అధ్యక్షులు పిల్లి మాణిక్యరావు, ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్, టిడిపి రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ మన్నవ మోహనకృష్ణ, గుంటూరు నగర మాజీ మేయర్ కోవెలమూడి రవీంద్ర, (నాని) జన చైతన్య గ్రూప్ అధినేత, తెలుగుదేశం పార్టీ యువ నాయకులు మాదల చైతన్య, మాదల మీనారత్న, టిడిపి రాష్ట్ర కార్యదర్శి తాళ్ల వెంకటేష్ యాదవ్, జనసేన పార్టీ నాయకులు బోనబోయిన శ్రీనివాసరావు, గాదె వెంకటేశ్వరరావు, చందు సాంబశివరావు, శ్రీను నాయక్,బిజెపి జిల్లా అధ్యక్షులు చెరుకూరితిరుపతిరావు, ఏపీ వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ మల్లెల ఈశ్వరరావు, డాక్టర్ నిమ్మల శేషయ్య, భాష్యం నరసయ్య, 59వ వార్డు ప్రెసిడెంట్ వడ్లమూడి వెంకటేశ్వరరావు, స్థానిక నాయకులు ఆధ్యా నాయక్, మూల్పురి పేరయ్య, ఊమ్లా నాయక్, కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులుపాల్గొన్నారు.

Author
Share This Article
Leave a review