ప్రత్తిపాడు నియోజకవర్గ నాయకులతో ఎల్ఈఎం బి. రామాంజనేయులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూరాబోయే GMC ఎన్నికలు కూటమి ఎన్నికలు. ఈ ఎన్నికల్లో TDP, JSP, BJP కలిసి పోటీ చేస్తాయి. సీట్ల కేటాయింపులో ఏ పార్టీకి సీటు వచ్చినా, అది మన కూటమి అభ్యర్థి అన్న భావనతో ప్రతి కార్యకర్త పనిచేయాలి. టికెట్ ఆశిస్తున్న ప్రతి నాయకుడు ఒక విషయం గుర్తుంచుకోవాలి. పార్టీ కంటే వ్యక్తి పెద్దవాడు కాదు. గెలుపే లక్ష్యం, కూటమి విజయమే ప్రధాన ధ్యేయం. అభ్యర్థి ఎంపికలో మొదటి అర్హత ప్రజల్లో మంచి పేరు మరియు నమ్మకం కలిగి ఉండటం. ప్రజల మధ్య తిరిగే నాయకుడికే ప్రాధాన్యం ఉంటుంది. రెండవ అర్హత పార్టీ కోసం కష్టకాలంలో కూడా పని చేసిన నిబద్ధత. ఎన్నికల సమయంలో మాత్రమే కనిపించే వారికి అవకాశం ఉండదు. మూడవ అర్హత కార్యకర్తలను కలుపుకుని వెళ్లే నాయకత్వ లక్షణం. విభేదాలు పెంచేవారికి కాదు, అందరినీ సమన్వయం చేసేవారికే అవకాశం.నాలుగవ అర్హత అవినీతి ఆరోపణలు లేకుండా స్వచ్ఛమైన ప్రజా జీవితం. ప్రజలు నమ్మే వ్యక్తులనే ముందుకు తీసుకువస్తాం. ఐదవ అర్హత సోషల్ మీడియా, ప్రజా సమస్యలు, యువతతో అనుసంధానం కలిగి ఉండటం. కొత్త తరానికి చేరువయ్యే నాయకత్వం అవసరం. ఆరవ అర్హత గెలిచే సామర్థ్యం. వ్యక్తిగత ఇమేజ్, ప్రజల మద్దతు, బూత్ స్థాయి బలం అన్నీ పరిశీలించిన తర్వాతే అభ్యర్థులను నిర్ణయిస్తాం.9. టికెట్ రాకపోయినా పార్టీ అభ్యర్థి గెలుపు కోసం పని చేసే వారినే నిజమైన నాయకులుగా గుర్తిస్తాం. భవిష్యత్తులో పార్టీ వారికి తప్పకుండా ప్రాధాన్యం ఇస్తుంది. గుంటూరు నగర అభివృద్ధి, ప్రజల సంక్షేమం, కూటమి ప్రభుత్వ బలం. ఈ మూడు లక్ష్యాలతో ప్రతి కార్యకర్త ఒక్కటై పనిచేస్తే GMCలో కూటమి జెండా ఎగరవేయడం ఖాయమని ఎమ్మెల్యే తెలిపారు.
GUNTUR DISTRICT NEWS: GMC ఎన్నికల్లో కూటమి విజయమే లక్ష్యం – ప్రజాభిమానం ఆధారంగానే అభ్యర్థుల ఎంపిక : ఎమ్మెల్యే రామాంజనేయులు

Sign Up For Daily Newsletter
Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Leave a review Leave a review
Stay Connected
Weather
27°C
Vijayawada
light rain
27° _ 27°
92%
1 km/h
Fri
32 °C
Sat
30 °C
Sun
27 °C


