GUNTUR DISTRICT NEWS: 37 వసతి గృహాల్లో ఎన్.జెడ్.హెచ్.సికి ప్రతిపాదనలు

Karthik

జిల్లాలో 37 వసతి గృహాల్లో నెట్ జీరో హెల్త్ క్యాంపస్ (ఎన్.జెడ్.హెచ్.సి)కి ప్రతిపాదనలు తయారు చేయాలని జిల్లా కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మ ఆదేశించారు. ఎన్.జెడ్.హెచ్.సి కార్యక్రమంపై ఫారెస్ట్ బై హార్ట్ ఫుల్ నెస్ ఫౌండేషన్ ప్రతినిధులు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బుధవారం జరిగిన కార్యక్రమంలో వివరించారు. ఎన్.జెడ్.హెచ్.సిలో భాగంగా జీరో వేస్ట్ మేనేజ్మెంట్, నెట్ జీరో ఎనర్జీ, నెట్ జీరో కార్బన్, గ్రీన్ నెట్ వంటి అంశాలతో వసతి గృహాలు, పాఠశాల ఆవరణలో ప్రశాంతమైన, ఆహ్లాదమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని నెలకొల్పడం జరుగుతుందని ఫౌండేషన్ ప్రతినిధులు కార్యాచరణను వివరించారు. జిల్లా కలెక్టర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో మొదటి విడతగా 37 వసతిగృహాల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టకు స్పష్టమైన కార్యాచరణను తయారు చేయాలన్నారు. వసతి గృహాల్లో నెట్ జీరో ఎనర్జీ క్రింద సౌర విద్యుత్తు ఏర్పాటు అవకాశాలు పరిశీలించాలని, ప్రాంగణమంతా స్థానిక పెరుగుదల ఉన్నటువంటి చెట్లను నాటాలని, బయో వేస్ట్ ఎనర్జీ పక్కాగా చేపట్టుటకు, నెట్ జీరో కార్బన్ ఉండే విధంగా కార్యాచరణ రూపొందించాలన్నారు. ప్రతిపాదించిన వసతిగృహాల్లో మంచి వాతావరణం ఏర్పాటు కావడమే కాకుండా భవిష్యత్తులో చక్కని నిర్వహణకు అవకాశం ఉండాలని సూచించారు.గుంటూరు జిల్లాలో పచ్చదనం శాతాన్ని పెంచుటకు చర్యలు చేపడుతున్నామని అందులో భాగంగా గుంటూరు పట్టణంలో గ్రీన్ కవర్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామన్నారు. గ్రీన్ కవర్ లో భాగంగా బ్లాక్ ప్లాంటేషన్, ఎవెన్యూ ప్లాంటేషన్ చేపడతామని చెప్పారు. స్థానిక రకాల చెట్లను వేస్తున్నట్లు చెప్పారు. చెట్ల పెరుగుదల బాగుండుటకు మూడు నుండి ఆరు అడుగుల చెట్లను నాటుటకు చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఈ సమావేశంలో డి.ఆర్.డి.ఏ ప్రాజెక్టు డైరెక్టర్ వి.విజయ లక్ష్మి, జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ వి.శంకర్, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి యు. చెన్నయ్య, జిల్లా బిసి సంక్షేమ శాఖ అధికారి కె.మయూరి, జిల్లా గిరిజన సంక్షేమ, సాధికారత అధికారి డి.దుర్గాబాయి, తదితరులు పాల్గొన్నారు.

Author
Share This Article
Leave a review