GUNTUR CITY NEWS: చంద్రబాబు వెన్నుపోటుకి రెండేళ్లు

Karthik

కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని YCP గుంటూరు నగర అధ్యక్షురాలు నూరీఫాతీమా ధ్వజమెత్తారు. చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు పేరుతో ఈ నెల 4 నుంచి వైసీపీ నిరసనలు చేపడుతుందన్నారు. పార్టీ నగర కార్యాలయంలో వెన్నుపోటుకు రెండేళ్లు పోస్టర్‌ని బుధవారం ఆవిష్కరించి ఆమె మాట్లాడారు. ప్రభుత్వ అసమర్థ పాలనతో రాష్ట్రం క్రైమ్ రేట్, మహిళలపై దాడుల విషయంలో ముందంజలో ఉందన్నారు. నిరసనలో కూటమి వైఫల్యాలు ఎండగతామన్నారు. కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలన్నారు.

Author
Share This Article
Leave a review