GUNTUR CITY NEWS: నార్త్ పారిష్ లూథరన్ చర్చిలో లక్ష్మీ అపర్ణ ప్రత్యేక ప్రార్థనలు

Karthik

గుంటూరు సెంటర్‌లోని నార్త్ పారిష్ లూథరన్ చర్చిలో కోవెలమూడి లక్ష్మీ అపర్ణ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మేయర్ గా విజయం సాధించాలని చర్చి సంఘ సభ్యులు ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా చర్చి ఫాదర్ మాట్లాడుతూ.. కోవెలమూడి నాని మేయర్‌గా ఉన్న సమయంలో చర్చి నిర్మాణానికి సంబంధించి ఎదురైన సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. కులమతాలకు అతీతంగా స్పందించిన నాని తమకు సహకరించారని పేర్కొన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ నుంచి అనుమతులు పొందడంలో కొంత జాప్యం జరిగినప్పటికీ, నాని చొరవ తీసుకుని సమస్య పరిష్కారానికి సహాయం చేశారని గుర్తుచేసుకున్నారు. గతంలో తమకు అందించిన సహకారాన్ని గుర్తుచేసుకుంటూ, కోవెలమూడి లక్ష్మీ అపర్ణ విజయం సాధించాలని చర్చి సంఘ సభ్యులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో బిషప్ డాక్టర్ ఎస్.జె. బాబురావు, పురుషోత్తం చౌదరి, శామ్యూల్ జాన్, పాస్టర్ కిరణ్, రెవరెండ్ ఆర్. మధుబాబు తదితరులు పాల్గొన్నారు.

Author
Share This Article
Leave a review