GUNTUR CITY NEWS: గుంటూరు మేయర్‌గా లక్ష్మీ అపర్ణ విజయం ఖాయం

Karthik

గుంటూరు నగర కూటమి మేయర్ అభ్యర్థి కోవెలమూడి లక్ష్మీ అపర్ణ భారీ మెజార్టీతో విజయం సాధించాలని నారెడ్కో సభ్యులు ఆకాంక్షించారు. మాజీ మేయర్ కోవెలమూడి నాని కార్యాలయంలో సమావేశమైన నారెడ్కో సభ్యులు లక్ష్మీ అపర్ణకు ముందస్తు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా చుక్కపల్లి రమేష్ మాట్లాడుతూ, గుంటూరు నగర ప్రజల నుంచి కోవెలమూడి లక్ష్మీ అపర్ణకు విశేష ఆదరణ లభిస్తోందని, ఆమె మేయర్‌గా భారీ మెజార్టీతో విజయం సాధిస్తారనే నమ్మకం ఉందని అన్నారు. ప్రజల ఆశీస్సులతో ఆమె ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎస్. మధుసూదన్ రెడ్డి, చుక్కపల్లి రమేష్, నాయుడు శ్రీనివాస్ కుమార్, కె. చిన్న అంకారావు, మదాల బాబు, యాగంటి దుర్గాప్రసాద్, కె. చిన్న తిరుపతయ్య, టి. అర్జున్ సాయి తదితర నారెడ్కో సభ్యులు పాల్గొన్నారు.

Author
Share This Article
Leave a review