GUNTUR CITY NEWS: పట్టాభిపురం మస్జిద్-ఏ-అతీఖుర్ రెహమాన్‌లో ప్రత్యేక ప్రార్థనలు..

Karthik

గుంటూరు నగరంలోని పట్టాభిపురం వద్ద ఉన్న మస్జిద్-ఏ-అతీఖుర్ రెహమాన్ నందు నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల కార్యక్రమంలో గుంటూరు నగర కూటమి మేయర్ అభ్యర్థి లక్ష్మి అపర్ణ కోవెలమూడి , 49వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి బండ్రెడ్డి విద్యావతి కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లిం మత పెద్దలు, స్థానిక ప్రముఖులు, ముస్లిం సోదరులను ఆత్మీయంగా పలకరించారు. మతసామరస్యం, సోదరభావం, శాంతియుత సహజీవనం ప్రాధాన్యతను చాటుతూ, ప్రజలందరూ సుఖసంతోషాలతో జీవించాలని, గుంటూరు నగరం శాంతి, సౌభ్రాతృత్వాలతో అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.

Author
Share This Article
Leave a review