ఘని భాషా, రిపోర్టర్ | చీరాల, బాపట్ల జిల్లా:
దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా చీరాల సంత బజార్‌లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో 1,116 కలశాలతో సహస్ర కలశాభిషేకం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చీరాల ఎమ్మెల్యే ఎం.ఎం. కొండయ్య పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

కలశాభిషేకానికి ముందు 1,116 కలశాలతో భక్తులు చీరాల పురవీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. ఈ ఊరేగింపు భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు, కలశాభిషేక కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా దేవస్థానం అధ్యక్షుడు గుంటూరు మాధవరావు మాట్లాడుతూ.. ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తొమ్మిది రోజుల పాటు అమ్మవారికి ప్రత్యేక అలంకరణలు చేసి, విశేష పూజలు నిర్వహించనున్నట్లు చెప్పారు.
చీరాల పరిసర ప్రాంతాల భక్తులు అమ్మవారిని దర్శించుకుని ఆమె కృపాకటాక్షాలకు పాత్రులు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం కమిటీ సభ్యులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.About Us
SUBSCRIBE TO BAPATLA CITY NEWS YOUTUBE CHANNEL FOR DAILY NEWS UPDATES



