GUNTUR CITY NEWS: ఆత్మీయ పలకరింపు.. కూటమి గెలుపునకు పిలుపు!

Karthik

ఆత్మీయ పలకరింపు.. కూటమి గెలుపునకు పిలుపు!బ్రాడీపేటలో లక్ష్మీ అపర్ణ కోవెలమూడి ఇంటింటి ప్రచారంప్రజలను ఆత్మీయంగా పలకరిస్తూ ఓటు అభ్యర్థన గుంటూరు నగర కూటమి మేయర్ అభ్యర్థి లక్ష్మీ అపర్ణ కోవెలమూడి ఎన్నికల ప్రచారంలో భాగంగా బ్రాడీపేటలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ వీధుల్లో పర్యటిస్తూ స్థానిక ప్రజలను ఆత్మీయంగా పలకరించి, కూటమి అభ్యర్థులకు మద్దతు తెలిపి ఓటు వేయాలని అభ్యర్థించారు.ప్రజలతో నేరుగా మమేకమవుతూ వారి ఆదరాభిమానాలను కోరారు. ఈ కార్యక్రమంలో 41వ డివిజన్ కూటమి కార్పొరేటర్ అభ్యర్థి గాయత్రి బెహరాతో పాటు డాక్టర్ స్రవంతి, లకార, పవన్, లలితా శాస్త్రి, మల్లికార్జున శర్మ, సీతా రమేష్, సాయి, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Author
Share This Article
Leave a review