Markapur District news :కంభం ఎంపీటీసీల వీడ్కోలు మర్యాదపూర్వక కలయిక-మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబుకు ఘన సత్కారం

Sharat
3 Views

మార్కాపురం:– కంభం మండలంలో ఐదేళ్లపాటు ప్రజలకు సేవలు అందించి పదవీకాలాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్న ఎంపీటీసీ సభ్యులు శుక్రవారం గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే, మార్కాపురం నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జి అన్నా రాంబాబును మర్యాదపూర్వకంగా కలిశారు.prakasam city news :చిన్నగంజాం మండలంలో తీరనున్న ఇంధన కష్టాలు- తాసిల్దార్ కే. ప్రభాకర్

మార్కాపురం పట్టణంలోని జవహర్‌నగర్ కాలనీలో గల అన్నా రాంబాబు స్వగృహంలో ఈ ఆత్మీయ కలయిక జరిగింది. ఈ సందర్భంగా ఎంపీటీసీ సభ్యులు ఆయనను కలిసి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం అన్నా రాంబాబును పూలమాలలు, శాలువాలతో ఘనంగా సత్కరించారు.

తన ఐదేళ్ల పదవీకాలంలో మండల పరిధిలోని ప్రజా సమస్యల పరిష్కారానికి, వివిధ అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణకు అన్నా రాంబాబు అందించిన నిరంతర సహకారం, ప్రోత్సాహం మరువలేనిదని ఎంపీటీసీ సభ్యులు ఈ సందర్భంగా కొనియాడారు. ఆయన మార్గదర్శకత్వంలోనే ప్రజాసేవను సమర్థవంతంగా అందించగలిగామని పేర్కొంటూ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Author
Share This Article
Leave a review