GUNTUR CITY NEWS: లక్ష్మీ అపర్ణ కోవెలమూడికి అఖండ మెజారిటీ ఇవ్వండి!

Karthik

లక్ష్మీ అపర్ణ కోవెలమూడికి అఖండ మెజారిటీ ఇవ్వండి!అభివృద్ధిని కొనసాగించేందుకు ఆశీర్వదించండి. మేయర్ అభ్యర్థి లక్ష్మీ అపర్ణ కోవెలమూడి గుంటూరు పార్లమెంట్‌ను దేశానికే రోల్ మోడల్‌గా తీర్చిదిద్దుతాం: కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖ ర్రెండున్నరేళ్లలో 19వ వార్డులో రూ.40 కోట్లకు పైగా అభివృద్ధి పనులుమేయర్ అభ్యర్థికి సైకిల్ గుర్తు.. కార్పొరేటర్ అభ్యర్థికి గాజు గ్లాసు గుర్తు: ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులుగుంటూరు నగర మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఏటూకురులో ఎన్నికల ప్రచారం జోరుగా సాగింది. ఈ ప్రచారంలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, కూటమి మేయర్ అభ్యర్థి కోవెలమూడి లక్ష్మీ అపర్ణ, 19వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి దాసరి లక్ష్మీ దుర్గ పాల్గొన్నారు. ఏటూకురులో రోడ్‌షో నిర్వహించడంతో పాటు 19వ వార్డులోని వివిధ వీధుల్లో పర్యటిస్తూ కూటమి అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు.అభివృద్ధిని కొనసాగించేందుకు ఆశీర్వదించండి.కూటమి మేయర్ అభ్యర్థి కోవెలమూడి లక్ష్మీ అపర్ణ మాట్లాడుతూ, ఎన్నికల ప్రచారంలో ప్రజలు చూపిస్తున్న ఆదరణకు కృతజ్ఞతలు తెలిపారు. గుంటూరు నగర అభివృద్ధిని కొనసాగించేందుకు తనను మేయర్ అభ్యర్థిగా సైకిల్ గుర్తుపై, కూటమి కార్పొరేటర్ అభ్యర్థి దాసరి లక్ష్మీ దుర్గను గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు.గుంటూరును అభివృద్ధిలో రోల్ మోడల్‌గా తీర్చిదిద్దుతాంకేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ, గత ఎన్నికల్లో గుంటూరు పార్లమెంట్ ప్రజలు కూటమికి అందించిన అఖండ విజయానికి కృతజ్ఞతలు తెలిపారు. జనసైనికులు, కూటమి కార్యకర్తలకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేశారు. దేశంలోని ఇతర పార్లమెంట్ నియోజకవర్గాలకు ఆదర్శంగా నిలిచేలా గుంటూరులో అభివృద్ధి పనులు చేపడుతున్నామని పేర్కొన్నారు.దాదాపు రూ.500 కోట్లతో సిమెంట్ రహదారులు, డ్రైనేజీలు, ఇతర మౌలిక వసతుల నిర్మాణ పనులు చేపడుతున్నట్లు తెలిపారు. ఏటూరు, బుడంపాడు తదితర గ్రామాల్లో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు రూ.576 కోట్ల నిధులతో అమృత్ 2 పథకం కింద పనులు ప్రారంభించామని, వాటిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని వెల్లడించారు. గుంటూరు పార్లమెంట్‌ను అభివృద్ధిలో దేశానికే రోల్ మోడల్‌గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని స్పష్టం చేశారు.అభివృద్ధిని చూసి కూటమి అభ్యర్థులను గెలిపించండి : ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు మాట్లాడుతూ, మేయర్ అభ్యర్థి కోవెలమూడి లక్ష్మీ అపర్ణను సైకిల్ గుర్తుపై, 19వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి దాసరి లక్ష్మీ దుర్గను గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. గాజు గ్లాసు గుర్తు విశ్వాసానికి, సైకిల్ గుర్తు అభివృద్ధి, సంక్షేమానికి ప్రతీకలని పేర్కొన్నారు.ఇప్పటికే ఏటూకురు లో రూ.45 కోట్లతో 124 అభివృద్ధి పనులు చేపట్టి చూపించామని బూర్ల రామాంజనేయులు తెలిపారు. ఇచ్చిన హామీలను అమలు చేస్తూ అభివృద్ధి దిశగా ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు. రాబోయే ఐదేళ్లలో రూ.100 కోట్లతో గ్రామంలో మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టి, ప్రజలు మళ్లీ సమస్యల పరిష్కారం కోసం అడగాల్సిన అవసరం లేకుండా చేసే బాధ్యత తీసుకుంటామని హామీ ఇచ్చారు. కూటమి అభ్యర్థులకు అఖండ మెజారిటీ అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.డివిజన్ అభివృద్ధికి కృషి చేస్తా19వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి దాసరి లక్ష్మీ దుర్గ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం బలపరిచిన అభ్యర్థిగా మేయర్ అభ్యర్థి కోవెలమూడి లక్ష్మీ అపర్ణతో కలిసి డివిజన్ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. ప్రజల అమూల్యమైన ఓటును తనకు గాజు గ్లాసు గుర్తుపై, మేయర్ అభ్యర్థి లక్ష్మీ అపర్ణకు సైకిల్ గుర్తుపై వేసి ఇద్దరినీ గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు, ఏపీఐడీసీ చైర్మన్ డేగల ప్రభాకర్, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు, కోమటి జైరాం, నేరెళ్ల సురేష్, కిలారి రోశయ్య, చందు సాంబశివరావు, ఉగ్గిరాల సీతారామయ్య, రావిపాటి సాయికృష్ణ, రాయపాటి అమృతరావు తదితర కూటమి నాయకులు పాల్గొన్నారు.

Author
Share This Article
Leave a review