బిఈడి వన్ టైం పరీక్షలను వెంటనే నిర్వహించాలి

Karthik
5 Views

ఆరు నెలల క్రితం బిఈడి వన్ టైం పరీక్షల నోటిఫికేషన్ విడుదల చేసి… నేటి వరకు పరీక్షలు నిర్వహించ క పోవటం సరికాదని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ వైసిపి విద్యార్థి విభాగం అధ్యక్షుడు పంతగాని రమేష్ ఒక ప్రకటనలో తెలిపారు. మే ఐదో తేదీన ఈ పరీక్షలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేశారని.. జులై 13 నుంచి పరీక్షలు నిర్వహిస్తామని నోటిఫికేషన్లో పేర్కొన్నారని ఆయన అన్నారు. నోటిఫికేషన్ విడుదలై ఆరు నెలలు గడిచిన.. పరీక్ష తేదీ దాటి నాలుగు నెలలు గడిచిన నేటి వరకు పరీక్షలు నిర్వహించ క పోవటం విద్యార్థులకు అన్యాయం చేయడమే అని ఆరోపించారు. డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలై దరఖాస్తులు స్వీకరణ ప్రారంభమైన బీఈడీ పరీక్షలు నిర్వహణలో వర్సిటీ కాలయాపన వల్ల విద్యార్థులు డీఎస్సీ పరీక్ష రాసే అవకాశం కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. డీఎస్సీ పరీక్ష నెపంతో బీఈడీ ప్రాక్టికల్స్ ను షెడ్యూల్ కంటే ముందే నిర్వహించిన వర్సిటీ ఇచ్చిన షెడ్యూల్ పూర్తయి నాలుగు నెలలు గడిచిన బీఈడీ వన్ టైంపరీక్షలను ఎందుకు నిర్వహించటం లేదని ఆయన ప్రశ్నించారు. ఇప్పటికైనా వర్సిటీ వెంటనే పరీక్షలు నిర్వహించి విద్యార్థులకు డీఎస్సీ పరీక్ష రాసే అవకాశం పోకుండా చూడాలని ఆయన కోరారు. ఎన్నికల కోడ్ లో హడావుడిగా రెండు సెమిస్టర్ల పరీక్షలను ఒకేసారి ఉదయం సాయంత్రం నిర్వహించటంలో ప్రత్యేక శ్రద్ధ కనబరిచిన వర్సిటీ అధికారులు.. వన్ టైం పరీక్షలు నిర్వహణలో ఎందుకు కాలయాపన చేస్తున్నారని రమేష్ పేర్కొన్నారు.

Author
Share This Article
Leave a review