గుంటూరు అమరావతి రోడ్డులోని అన్నదాన సత్రం ద్వారా నిత్యం ఎంతోమంది భక్తులకు, పేదలకు ఉపయోగం కలుగుతోందని, ఇలాంటి సేవా కార్యక్రమాలకు ఆధ్యాత్మిక కేంద్రాల నిర్మాణం మరింత తోడ్పాటునిస్తుందని ఎమ్మెల్యే గళ్ళా మాధవి పేర్కొన్నారు. 60వ డివిజన్ అమరావతి రోడ్డులోని అన్నదాన సత్రం వద్ద శ్రీ ఉమా మహేశ్వర స్వామి (భీమేశ్వర స్వామి) దేవస్థాన పునర్నిర్మాణ పనులకు ఎమ్మెల్యే గళ్ళా మాధవి, మేయర్ కోవెలమూడి లక్ష్మీ అపర్ణ శంకుస్థాపన చేశారు. ఆలయ నిర్మాణానికి పూర్తి ఖర్చును భరించేందుకు ముందుకొచ్చిన కోటేశ్వరరావును అభినందించారు. స్వామివారి ఆశీస్సులు స్థానిక ప్రజలందరికీ త్వరగా అందాలన్నదే తమ ఆకాంక్ష అని అన్నారు.దేవస్థానం ఈఓ, ఆలయ చైర్మన్ సాంబశివరావు పర్యవేక్షణలో నిర్మాణ పనులు వేగంగా ముందుకు సాగాలని, నిర్మాణానికి అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు స్థానిక కార్పొరేటర్లు సిద్ధంగా ఉన్నారని, ఎలాంటి అవసరాలున్నా తమను సంప్రదించాలని సూచించారు. అందరూ సమన్వయంతో పనిచేసి ఆలయ నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ ధనలక్ష్మి, ఇతర కార్పొరేటర్లు, ఆలయ కమిటీ సభ్యులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, భక్తులు పాల్గొన్నారు.
అన్నదాన సత్రం ద్వారా ఎంతోమంది భక్తులకు సేవలందించడం అభినందనీయం

Sign Up For Daily Newsletter
Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Leave a review Leave a review
Stay Connected
Weather
29°C
Vijayawada
scattered clouds
29° _ 29°
58%
4 km/h
Sun
29 °C
Mon
31 °C
Tue
31 °C


