Guntur City News :సాంఘిక సంక్షేమ వసతి గృహాలను తనిఖీ చేసిన డీఎల్‌ఎస్‌ఏ కార్యదర్శి సయ్యద్ జియాఉద్దీన్

S Sarath
1 View

గుంటూరు, నవంబర్ 23:– జాతీయ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థల ఆదేశాల మేరకు, క్యాలెండర్ కార్యక్రమాలలో భాగంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ (డీఎల్‌ఎస్‌ఏ) కార్యదర్శి సయ్యద్ జియాఉద్దీన్ సోమవారం నగరంపాలెంలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ కళాశాల బాలుర వసతి గృహాలు (1 & 2) ను ఆకస్మికంగా సందర్శించారు.

ఈ సందర్భంగా వసతి గృహంలోని విద్యార్థులతో ఆయన స్వయంగా ముఖాముఖి మాట్లాడారు. విద్యార్థులకు అందిస్తున్న ఆహార నాణ్యత, విద్య, వైద్య సదుపాయాలు మరియు ఇతర మౌలిక వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఉజ్వల భవిష్యత్తుకు విద్యే పునాది అని, విద్యార్థులంతా క్రమశిక్షణతో బాగా చదువుకుని జీవితంలో ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆయన ఆకాంక్షించారు.Guntur City News

అనంతరం వసతి గృహ సిబ్బందితో సమావేశమై, విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నాణ్యమైన సేవలు అందించాలని తగు సూచనలు చేశారు. ఈ తనిఖీ కార్యక్రమంలో హాస్టల్ వార్డెన్-1, డీఎల్‌ఎస్‌ఏ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

Author
Share This Article
Leave a review