Guntur City News :ఓటర్లకు కీలక అప్‌డేట్- డిసెంబరు 22న ఎస్.ఐ.ఆర్ తుది జాబితా.. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటు నమోదుకు మరో ఛాన్స్

S Sarath
1 View

గుంటూరు (ప్రతినిధి):– ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం (ఎస్.ఐ.ఆర్) మరియు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు ప్రక్రియపై ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వివేక్ యాదవ్ సోమవారం జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ అనంతరం గుంటూరు జిల్లా కలెక్టర్ సి.ఎం. సాయికాంత్ వర్మ, డీఆర్వో ఎన్.ఎస్.కె. ఖాజావలి పూర్తి వివరాలను వెల్లడించారు.

1. ఓటరు జాబితా సవరణ (ఎస్.ఐ.ఆర్) ముఖ్యాంశాలు:

  • తుది జాబితా: ప్రత్యేక సవరణ కార్యక్రమంలో భాగంగా తుది ఓటరు జాబితాను డిసెంబరు 22న విడుదల చేయనున్నట్లు కలెక్టర్ సాయికాంత్ వర్మ తెలిపారు.
  • నవంబరు 30 తుది గడువు: ఇప్పటివరకు ఎన్యూమరేషన్ ఫారం అందించని ఏఎస్‌డీడీ (ఆబ్సెంట్, షిఫ్టెడ్, డూప్లికేట్, డిసీజ్డ్) జాబితాలోని వారు నవంబరు 30వ తేదీ లోపు తప్పనిసరిగా ఫారాలు సమర్పించాలి. కొత్త వారి నుంచి దరఖాస్తులు స్వీకరించబోమని కలెక్టర్ స్పష్టం చేశారు.
  • విచారణ: అందిన దరఖాస్తులపై డిసెంబరు 10 లోగా విచారణ పూర్తి చేసి, అర్హులైన వారి పేర్లను జాబితాలో చేరుస్తారు.

2. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటరు నమోదుకు మరో అవకాశం: గుంటూరు – కృష్ణా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గ ఎన్నికలకు సంబంధించి ఓటు నమోదు చేసుకోని వారికి మరో అవకాశం కల్పిస్తున్నట్లు ఇ.ఆర్.ఓ, డీఆర్వో ఎన్.ఎస్.కె. ఖాజావలి ప్రకటించారు.

  • నమోదు తేదీలు: డిసెంబరు 23 నుండి జనవరి 12 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
  • తుది జాబితా: ఫిబ్రవరి 2న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ తుది ఓటరు జాబితాను విడుదల చేస్తారు.
  • అర్హతలు ఇవే: పూర్వ గుంటూరు, కృష్ణా జిల్లాల్లో స్థానిక నివాసం ఉంటూ, ఉన్నత పాఠశాల మరియు ఆపై స్థాయిలో బోధిస్తున్న ఉపాధ్యాయులు, అధ్యాపకులు అర్హులు. 2026 నవంబరు 1 నాటికి ఆరేళ్ల సర్వీసు పూర్తి చేసుకుని, అందులో కనీసం మూడేళ్ల పాటు ఉన్నత పాఠశాల లేదా ఆపై స్థాయిలో బోధనా అనుభవం ఉండాలి.
  • ప్రైవేట్ టీచర్లకు: ప్రైవేట్ విద్యాసంస్థల్లో పనిచేసే వారికి కూడా అర్హత ఉంది. అయితే వీరి సర్వీసును డీఈవో, ఆర్ఐవో లేదా కళాశాల విద్య జాయింట్ డైరెక్టర్ ధృవీకరించాల్సి ఉంటుంది.Guntur City News
  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా లేదా ఫారం-19 పూర్తి చేసి స్థానిక తహసీల్దార్, ఎంపీడీవో, ఆర్డీవో, మున్సిపల్ కమిషనర్ కార్యాలయాల్లోని ఏఈఆర్వోలకు సమర్పించవచ్చు.
Author
Share This Article
Leave a review