GUNTUR DISTRICT NEWS: ఏఐటీయూసీ 18వ రాష్ట్ర మహాసభల విజయానికి గుంటూరు నుంచి జీపు జాత ప్రారంభం

Karthik
4 Views

తిరుపతి మహానగరంలో ఈనెల 26 నుండి 28 వరకు నిర్వహించనున్న ఏఐటీయూసీ 18వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని రాష్ట్ర నాయకులు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మూడు సంవత్సరాల క్రితం గుంటూరు నగరంలో జరిగిన ఏఐటీయూసీ 17వ మహాసభ జెండాను ప్రత్యేకంగా జీపు జాతగా తీసుకెళ్లి తిరుపతిలో జరిగే మహాసభ వేదికపై జాతీయ ప్రధాన కార్యదర్శి అమర్ జిత్ కౌర్ గారికి అందజేయనున్నట్లు తెలిపారు.ఈ జీపు జాత కార్యక్రమాన్ని గుంటూరు మల్లయ్య లింగం భవన్ నుండి ఈ కార్యక్రమాన్ని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటసుబ్బయ్య ఏఐటీయూసీ జెండా ఊపి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికుల హక్కుల పరిరక్షణ, సంక్షేమం కోసం ఏఐటీయూసీ ఎల్లప్పుడూ పోరాడుతుందని, తిరుపతి మహాసభలు కార్మిక ఉద్యమానికి కొత్త దిశానిర్దేశం చేయనున్నాయని అన్నారు.రాష్ట్ర గౌరవ అధ్యక్షులు వెలుగూరి రాధాకృష్ణమూర్తి మాట్లాడుతూ, ఏప్రిల్ 26వ తేదీన జరుగు కార్మిక మహా ప్రదర్శన బహిరంగ సభ లో కార్మికులు పెద్ద సంఖ్యలో మహాసభలకు హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ జీపు జాత మార్గమధ్యంలో పలు ప్రాంతాల్లో ఆగుతూ కార్మికులను మహాసభలకు ఆహ్వానించనుంది. కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్మిక సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Author
Share This Article
Leave a review