అన్నా క్యాంటీన్ కు విరాళం ఇచ్చిన ఉపాధ్యాయుడు చెరుకూరి శ్రీనివాస్

City News Telugu
1 Min Read

ముఖ్యమంత్రికి చెక్కు అందజేత

నరసరావు పేట, ఏప్రిల్ 15బుధవారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతి మండల కేంద్రంలో ప్రారంభించిన అన్నా క్యాంటీన్ నిర్వహణ కోసం ఉపాధ్యాయులు చెరుకూరి శ్రీనివాస్ రూ.1,17,000 విరాళం అందించారు. హెలీ ప్యాడ్ వద్ద ముఖ్యమంత్రిని కలిసి చెక్కు అందజేశారు.తాడికొండ జెడ్పీహెచ్ఎస్ లో ఇంగ్లీష్ అసిస్టెంట్ గా పని చేస్తున్న చెరుకూరి శ్రీనివాస్ 2016లో రాజధాని అమరావతి నిర్మాణం కోసం రూ.20,000, అనంతరం 2019లో జన్మభూమి కార్యక్రమం కోసం రూ.50,000 విరాళంగా అందించారు.రాష్ట్ర అభివృద్ధికి ఎప్పటికప్పుడు తనకు చేతనైన సహాయం చేస్తున్న చెరుకూరి శ్రీనివాస్ ను ముఖ్యమంత్రి అభినందించారు.

Total Views: 1,000
Share This Article
Leave a Comment