BAPATLA DISTRICT CITY NEWS : చీరాలలో 114 మందికి రూ.53 లక్షల సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ

City News Telugu

ఘని భాషా, రిపోర్టర్ | చీరాల, బాపట్ల జిల్లా:

పేద ప్రజల సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని చీరాల ఎమ్మెల్యే ఎం.ఎం. కొండయ్య అన్నారు. చీరాలలోని టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో 114 మంది లబ్ధిదారులకు రూ.53 లక్షల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) చెక్కులను ఆయన పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలో

tకి వచ్చిన రెండేళ్ల మూడు నెలల కాలంలో సీఎం చంద్రబాబు నాయుడు సహకారంతో 1,394 మంది పేదలకు వైద్య ఖర్చుల నిమిత్తం రూ.11.64 కోట్ల సీఎంఆర్‌ఎఫ్ ఆర్థిక సాయం అందించినట్లు తెలిపారు.

గత ఐదేళ్ల వైసీపీ పాలనలో చీరాల నియోజకవర్గంలో పేదలకు వైద్య ఖర్చుల కోసం సీఎంఆర్‌ఎఫ్ ద్వారా ఆర్థిక సాయం అందించిన దాఖలాలు లేవని ఆయన వ్యాఖ్యానించారు.About Us

ప్రస్తుతం నియోజకవర్గంలో రూ.209 కోట్లతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని, చీరాల మున్సిపాలిటీలోనే రూ.100 కోట్లకు పైగా పనులు జరుగుతున్నాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. రానున్న మున్సిపల్, పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

అనంతరం ఎమ్మెల్యే కొండయ్య ప్రజా దర్బార్ నిర్వహించి నియోజకవర్గ ప్రజల నుంచి సమస్యలపై అర్జీలను స్వీకరించారు.

SUBSCRIBE TO BAPATLA CITY NEWS YOUTUBE CHANNEL FOR DAILY NEWS UPDATES

https://www.youtube.com/@bapatlacitynewstelugu

Share This Article
Leave a review