హైదరాబాద్: నగరంలో గణేశ్ ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. బేగంబజార్లో మహా గణపతి ఉత్సవ్ సమితి ఆధ్వర్యంలో ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేకంగా ‘100 ఇయర్స్ గణేశ్ మండపం’ ఏర్పాటు చేశారు. గత 14 సంవత్సరాలుగా గణేశ్ ఉత్సవాలను విభిన్న రీతుల్లో నిర్వహిస్తూ భక్తులను ఆకట్టుకుంటున్నామని నిర్వాహకులు తెలిపారు.

మండపంలో గణనాథుడిని కొలువుదీర్చి భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు, కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలను ప్రతిబింబించేలా మండపాన్ని ప్రత్యేకంగా అలంకరించారు. మండపం వెనుక భాగంలో ఏర్పాటు చేసిన భారతదేశ ఆకృతి కటింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.
ఆపద సమయంలో ప్రజలకు అండగా నిలిచే ఆపద్బాంధవుడిలా ఆర్ఎస్ఎస్ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తోందని నిర్వాహకులు పేర్కొన్నారు. ఎలాంటి కష్టం, ఆపద ఎదురైనా ప్రజలకు సహాయం చేసేందుకు ఆర్ఎస్ఎస్ ముందుంటుందని తెలిపారు.Hyderabad City news
ప్రత్యేక అలంకరణలు, గణనాథుడి దర్శనం కోసం బేగంబజార్తో పాటు పరిసర ప్రాంతాల నుంచి భక్తులు, నగరవాసులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. మండపం వద్ద భక్తుల రద్దీ కనిపిస్తోంది.



