GUNTUR CITY NEWS: ఎన్నికల సమయంలో అప్రమత్తంగా ఉండాలి

Karthik

నగరంలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీ చేయు అభ్యర్ధులు వారి ఎన్నికల ఖర్చుల వివరాలను రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన నమూనాలో మాత్రమె అందజేయాలని ఎగ్జామినర్ ఆఫ్ అకౌంట్స్ ఎలీషా తెలియచేశారు. శనివారం అడిషనల్ ఎలక్షన్ అధారిటీ మరియు నగర కమిషనర్ కె. మయూర్ అశోక్ ఆదేశాల మేరకు నగర పాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో గుంటూరు నగర పాలక సంస్థ ఎన్నికల ఖర్చులను పర్యవేక్షించుటకు ఏర్పాటు చేసిన అసిస్టెంట్ ఎక్సిపెండిచర్ అబ్జర్వర్స్ మరియు అకౌంటింగ్ టీం లకు శిక్షణా కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఎగ్జామినర్ ఆఫ్ అకౌంట్స్ మాట్లాడుతూ, స్థానిక సంస్థల ఎన్నికలు పారదర్శకంగా నిష్పాక్షపాతంగా నిర్వహించేందుకు అసిస్టెంట్ ఎక్సిపెండిచర్ అబ్జర్వర్స్ మరియు అకౌంటింగ్ బృందాలు కృషి చేయాలన్నారు. ఈ స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీ చేయు అభ్యర్ధులు వారి ప్రచార సామాగ్రికి, కార్యకర్తల ప్రచార ఖర్చులు, వాహనములు మొదలైనవి రాష్ట్ర ఎన్నికల సంఘం వారు నిర్దేశించిన నమూనాలో మాత్రమె నమోదు చేసి, ఎన్నికల వ్యయానికి పెట్టినటువంటి మొత్తము ఖర్చును ఎన్నికల ఫలితాల ప్రకటన చేసిన 45 రోజుల లోపల ఎన్నికల అధికారులకు నిర్ధేశిత నమూనాలో దాఖలు పరచాలన్నారు. ఎన్నికల ఖర్చును పరోక్షంగా పర్యవేక్షిస్తూ (యస్.ఓ.ఆర్) షాడో అబ్జర్వేషన్ రిజిస్టర్ నందు నమోదు చేసి, సదరు అభ్యర్ధుల ఎన్నికల అకౌంట్లను పర్యవేక్షించే సమయములో వాటిని షాడో అబ్జర్వేషన్ రిజిస్టర్ తో సరిపోల్చి నిజమైన పారదర్శకమైన ఎన్నికల వ్యయ అకౌంట్లుగా మార్చవలసినదిగా అసిస్టెంట్ ఎక్సిపెండిచర్ అబ్జర్వర్స్ మరియు అకౌంటింగ్ టీం లకు శిక్షణా కార్యక్రమము నందు తెలియచేశామన్నారు. అదేవిధంగా ఎన్నికల వ్యయ పర్యవేక్షణలో పాల్గొనే వివిధ రకాల బృందాలు ఎఫ్.యస్.టి, యస్.యస్.టి, యం.సి.సి, వి.వి.టి, వి.యస్.టి, ఏ.టి ల పాత్ర, రాష్ట్ర ఎన్నికల సంఘం వారు జారీ చేసిన మార్గరదర్శకాలను వివరించామని, ఎన్నికల నియమావళిని అనుసరించి చేయవలసినవి మరియు చేయకూడనివి తెలియచేయుట జరిగినదన్నారు.సమావేశంలో అకౌంట్స్ ఆఫీసర్ తిరుపతి నాయుడు, అసిస్టెంట్ ఎగ్జామినర్ ఆఫ్ అకౌంట్స్ తిరుపతయ్య, డిస్ట్రిక్ట్ ఆడిట్ ఆఫీసర్ శ్రీకాంత్, గుంటూరు నగర పాలక సంస్ధ అకౌంట్స్ సిబ్బంది గుంటూరు నగర పాలక సంస్ధ పరిధిలలో బాధ్యతలు నిర్వహించబోయే అసిస్టెంట్ ఎక్సిపెండిచర్ అబ్జర్వర్స్ మరియు అకౌంటింగ్ టీమ్ పాల్గొన్నారు.

Author
Share This Article
Leave a review