తెలుగుదేశం పార్టీకి అంకితభావంతో సేవ చేసిన భాష్యం రామకృష్ణ గారికి రాజ్యసభ అవకాశం దక్కడం శుభపరిణామని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి గారు పేర్కొన్నారు. బుధవారం గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి గళ్ళా మాధవి, గళ్ళా రామచంద్రరావు రాజ్యసభ అభ్యర్థి భాష్యం రామకృష్ణని మర్యాదపూర్వకంగా కలుసుకుని శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పశ్చిమ నియోజకవర్గానికి చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గళ్ళా మాధవి మాట్లాడుతూ… భాష్యం రామకృష్ణ గారు పశ్చిమ నియోజకవర్గ ప్రజలకు, తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఎన్నో సంవత్సరాలుగా అండగా నిలుస్తూ వచ్చారని పేర్కొన్నారు. “నేను ఉన్నాను” అనే భరోసాను ప్రతి సందర్భంలోనూ కల్పిస్తూ, పార్టీ బలోపేతానికి నిరంతరం కృషి చేసిన నాయకుడిగా ఆయన ప్రత్యేక గుర్తింపు పొందారని అన్నారు.తెలుగుదేశం పార్టీ పట్ల ఆయన చూపిన అంకితభావాన్ని, విధేయతను, సేవలను గుర్తించిన పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో భాష్యం రామకృష్ణ గారికి రాజ్యసభ అవకాశం కల్పించడం అత్యంత శుభపరిణామమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. పార్టీ కోసం నిజాయితీగా పనిచేసే వారికి తగిన గౌరవం, బాధ్యతలు లభిస్తాయని భాష్యం రామకృష్ణ ఎంపిక మరోసారి నిరూపించిందని అన్నారు. రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన సందర్భంగా పెద్ద ఎత్తున అభిమానులు, నాయకులు, కార్యకర్తల సమక్షంలో జరిగిన కార్యక్రమం ఎంతో ఉత్సాహభరితంగా సాగిందని, అది పార్టీ శ్రేణుల్లో ఆనందాన్ని నింపిందని తెలిపారు. భాష్యం రామకృష్ణకి శుభాకాంక్షలు తెలియజేయడానికి గుంటూరు పశ్చిమ నియోజకవర్గ క్యాడర్ మొత్తం తరలివచ్చడం సంతోషకర విషయమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. నియోజకవర్గ ప్రజలు, పార్టీ శ్రేణుల తరఫున సంపూర్ణ సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఆయనకు ఉంటాయని హామీ ఇచ్చారు.



