GUNTUR CITY NEWS: మహిళలకు అండగా కూటమి ప్రభుత్వం

Karthik
16 Views

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే & తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యురాలు గళ్ళా మాధవి ఆదేశాల మేరకు నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో “మహిళా గ్రీవెన్స్” నిర్వహించారు. మహిళలు, ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు ముత్తినేని శివలీల, అంగన్వాడీ అధ్యక్షురాలు నంది సరస్వతి, డాక్టర్ సెల్ అధ్యక్షురాలు పంచుమర్తి కల్పన, టీడీపీ పార్లమెంట్ సెక్రటరీ గంటా మౌళిక తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో మహిళలకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని వారు పేర్కొన్నారు. ప్రజా ‌సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఎమ్మెల్యే గల్లా మాధవి పని చేస్తున్నారని తెలిపారు.

Author
Share This Article
1 Review