GUNTUR DISTRICT NEWS: ఆర్ అండ్ ఆర్ సర్వే పూర్తి చేయాలి

Karthik

ఆర్ అండ్ ఆర్ సర్వే శనివారం నాటికి పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మ ఆదేశించారు. సి.ఆర్.డి.ఏ భూ సమీకరణ, ఇతర పనుల పురోగతిపై కలెక్టర్ కార్యాలయంలో గురువారం జిల్లా కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆర్ అండ్ ఆర్ సర్వే పూర్తి చేసి ప్రచురణకు వెళ్లాలన్నారు. రికార్డు పరమైన ఆధారాలు పక్కాగా ఉండాలని స్పష్టం చేశారు. నిబంధనలు పాటించాలని ఆదేశించారు. సబ్ డివిజన్ వచ్చే గురువారం నాటికి పూర్తి కావాలని ఆదేశించారు. అభ్యంతరాలు ఉంటే ఈ వారంలో పూర్తి చేయాలని అన్నారు. భూ సమీకరణలో ప్రతి వారం పురోగతి కనిపించాలని అన్నారు. ఈ సమావేశంలో సి.ఆర్.డి.ఏ అదనపు కమిషనర్ ఏ.భార్గవ్ తేజ, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, జిల్లా రెవిన్యూ అధికారి ఎన్.ఎస్.కె. ఖాజావలి, రెవిన్యూ డివిజనల్ అధికారి కె.శ్రీనివాస రావు,తెనాలి రెవిన్యూ డివిజనల్ అధికారి కె.శ్రీరమణి, సి.ఆర్.డి.ఏ డిప్యూటీ కలెక్టర్ లు, తదితరులు పాల్గొన్నారు.

Author
Share This Article
Leave a review