GUNTUR DISTRICT NEWS: పాలవాగు, కొండవీటి వాగు వరద నివారణ పనులు పరిశీలించిన కలెక్టర్

Karthik

వెస్ట్ బై పాస్ కు రెండు చోట్ల క్రాసింగ్ జరుగుతున్న పాలవాగు, కొండవీటివాగు వరద నివారణ పనులను జిల్లా కలెక్టర్ సి.యం.సాయి కాంత్ వర్మ సోమవారం పరిశీలించారు. పనులను రెండు రోజులలో పూర్తి చేయాలని గుత్తేదారును ఆదేశించారు. వర్షా కాలం ప్రారంభం కానున్న నేపథ్యంలో తక్షణం పనులు పూర్తి చేయాలని అన్నారు. పాలవాగు, కొండవీటివాగు ప్రవాహంలో ఎక్కడా అంతరాయం ఉండరాదని స్పష్టం చేశారు. పనులు జాప్యం జరిగితే వరద ప్రభావానికి గురయ్యే అవకాశం ఉంటుందని ఆయన హెచ్చరించారు. వరదలు రావడం, నీరు నిలువ ఉండరాదని స్పష్టం చేశారు. వరదలు అనే ప్రసక్తి ఎక్కడా తలెత్తరాదని అన్నారు.ఈ కార్యక్రమంలో సి.ఆర్.డి.ఏ అదనపు కమిషనర్ కొల్లాబత్తుల కార్తీక్, జలవనరుల శాఖ పర్యవేక్షక ఇంజనీర్ వెంకట రత్నం, తహసిల్దార్ దినేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Author
Share This Article
Leave a review