తుఫాన్ హెచ్చరిక: గుంటూరు నగర ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలి!

Karthik

వాయుగుండం తుపానుగా బలపడి నవంబరు 18 నుండి వర్షాలు కురిసే అవకాశం ఉందని,19వ తేదీన 18 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదు కాగలదని RTGS హెచ్చరించిన నేపథ్యంలో గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ కె. మయూర్ అశోక్ కీలక ఆదేశాలు జారీ చేశారు.**తుఫాన్ అత్యవసర స్పందనల కోసం జిఎంసి ప్రధాన కార్యాలయంలో 0863 2345103 కాల్ సెంటర్ ని సంప్రదించాలన్న కమిషనర్ *అధికారులు, సచివాలయ కార్యదర్శులు, సిబ్బంది నిరంతరం అందుబాటులో ఉండాలని ఆదేశం*✅ *లోతట్టు, ముంపు ప్రాంతాలను గుర్తించి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు.*✅ *డ్రైన్లలో నీరు నిలవకుండా ముందస్తుగా తొలగింపు, శిథిలావస్థలో ఉన్న భవనాలను ఖాళీ చేయించడం, ప్రమాదకర చెట్ల కొమ్మల తొలగింపు* .✅ *JCBలు, నీటిని తోడే మోటార్లు, జనరేటర్లతో ప్రత్యేక బృందాలను సిద్ధంగా ఉంచడం.*📢 *నగర ప్రజలు కూడా అధికారుల సూచనలు పాటిస్తూ, అత్యవసరమైతే తప్ప ఇంటి నుండి బయటకు వెళ్లకండి.*⚡ *ప్రమాదకర ప్రాంతాలకు దూరంగా: పాత ఇళ్లు, భారీ హోర్డింగ్‌లు, విద్యుత్ స్తంభాల వద్ద నిలబడవద్దు.*📞 *వదంతులు నమ్మవద్దని, ప్రభుత్వ అధికారిక ప్రకటనలను మాత్రమే విశ్వసించండని సూచించిన కమిషనర్.*♦️ *జిఎంసి అధికారులు కూడా తుఫాన్ పై సన్నద్ధంగా ఉండాలని,త్రాగునీటి సరఫరా, చెట్లు పడిపోతే తొలగించడంపై ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించిన కమిషనర్

Author
Share This Article
Leave a review