GUNTUR DISTRICT CRIME NEWS: గంజాయి సరఫరా చేస్తున్న 12 మంది నిందితుల అరెస్ట్

Karthik

గుంటూరు జిల్లాలో గంజాయి పై ఉక్కు పాదం మోపుతున్న పోలీసులు. దుగ్గిరాల పోలీసులు మెరుపు దాడులతో 2.5కేజీ ల గంజాయి, ద్విచక్ర వాహనం, ఫోన్, 2000రూపాయలు నగదు స్వాధీనం. 5గురు గంజాయి అమ్మేవారిని,7గురు గంజాయి సేవించేవారు అదుపులోకి తీసుకున్న పోలీసులు. ముద్దాయిలు ఒడిశా గోరకపూర్ నుంచి గంజాయిని తీసుకువచ్చి విక్రయిస్తున్నారు. 300 లకు పైగా పాత నేరస్తులకు గంజాయి యూరిన్ టెస్ట్ లు నిర్వహించాం వారిలో 30 మందికి గంజాయి సేవిస్తున్నట్లుగా నిర్ధారణ అయింది. దుగ్గిరాల, మంగళగిరి, తెనాలి, పెద కాకాని పరిధిలోని పలువురు గంజాయి సేవించే వారు ఉండటం గమనార్హం. మరలా మరలా గంజాయి అమ్ముతూ పట్టుపడితే వారిపై పీడీ యాక్ట్ ప్రయోగిస్తున్నాం. జిల్లాలో ఇప్పటికే పలువురు నిందితులపై పీడీ యాక్ట్ నమోదు చేసి జైలుకు తరలించడం జరిగింది. గంజాయి విషయంలో ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించిన ఎస్పీ వకుల్ జిందాల్.

Author
Share This Article
Leave a review