అన్ని వర్గాల ప్రజల్లో తమ హక్కులు, బాధ్యతల పట్ల సరైన అవగాహన, చైcతన్యం కలిగి ఉండటం అవసరం అని జిల్లా ప్రదాన న్యాయమూర్తి, డిఎల్‌ఎస్‌ఎ చైర్మన్ బి.కళ్యాణ చక్రవర్తి అన్నారు. రాజ్యాంగ లక్ష్యాలను దృష్టిలో పెట్టుకొని రూపొందించిన చట్టాలు, శాసనాలు ఎన్నో ఉన్నాయన్నారు. నిరక్షరాస్యత, పేదరికం, ప్రచారలోపం మొదలైన కారణాలతో చాలా మంది ప్రజలకు చట్టాల గురించి, రాజ్యాంగం గురించి అవగాహన లేక, చట్టపరిధిలో ఎలా వ్యవహరించాలో, న్యాయస్థానాలను ఎప్పుడు, ఎలా ఆశ్రయించాలో చట్ట ఉల్లంఘన ద్వారా అన్యాయం జరిగే చట్టబద్దంగా ఎలా ఎదుర్కొనాలో తెలియని పరిస్థితుల్లో కొంత మంది సామాన్య ప్రజలు ఉన్నారన్నారు. అందుకే గ్రామీణ ప్రాంతాల ప్రజలకు, బడుగు, బలహీన వర్గాలకు చట్టాల పట్ల అవగాహన చైతన్యం కలగచేయాలన్న ఉద్దేశంతో రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ ప్రారంభించిన న్యాయసేవల రధాలు అన్ని జిల్లాలకూ 13 వాహనాలు అందచేశారన్నారు. అందులో భాగంగా శుక్రవారం జిల్లా కోర్టు ఆవరణలో గుంటూరు జిల్లాకు వచ్చిన న్యాయసేవాల రధాన్ని జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.కళ్యాణ చక్రవర్తి, మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి వి.ఎ.ఎల్.సత్యవతి, డిఎల్‌ఎస్‌ఎ సెక్రెటరీ జియావుద్దీన్, అన్ని కోర్టుల న్యాయమూర్తులు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ రధాలు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పర్యటిస్తూ చట్టాలపై అవగాహన కల్పిస్తాయన్నారు.
GUNTUR DISTRICT NEWS: చట్టాలపై అవగాహనకు న్యాయసేవల రధాలు

Sign Up For Daily Newsletter
Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Leave a review Leave a review
Stay Connected
Weather
33°C
Vijayawada
broken clouds
33° _ 33°
56%
1 km/h
Sun
33 °C
Mon
35 °C
Tue
36 °C


