హైదరాబాద్: అంతర్జాతీయ హై-స్ట్రీట్ ఫ్యాషన్ బ్రాండ్ కెల్లీ ఫెల్డర్ భారత్‌లోకి అడుగుపెట్టింది. దేశంలో తన తొలి స్టోర్‌ను హైదరాబాద్ బంజారాహిల్స్‌లో ప్రారంభించింది. కొలంబో, మెల్‌బోర్న్ నగరాల్లో ఇప్పటికే తన బ్రాండ్ స్టోర్లను నిర్వహిస్తున్న కెల్లీ ఫెల్డర్.. భారత మార్కెట్‌లోకి ప్రవేశించేందుకు హైదరాబాద్‌ను తొలి వేదికగా ఎంచుకుంది.
బంజారాహిల్స్‌లో జరిగిన స్టోర్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి నటి నేహా శర్మ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఫ్యాషన్ రంగానికి చెందిన పలువురు ప్రముఖులు, ఫ్యాషన్ ప్రియులు, కంటెంట్ క్రియేటర్లు పాల్గొని సందడి చేశారు. నూతన ఫ్యాషన్ ట్రెండ్స్‌ను ప్రతిబింబించేలా స్టోర్‌ను ప్రత్యేకంగా తీర్చిదిద్దారు.
కెల్లీ ఫెల్డర్ స్టోర్‌లో మహిళలు, పురుషుల కోసం విభిన్న రకాల దుస్తులతో పాటు పెర్ఫార్మెన్స్‌వేర్, యాక్సెసరీస్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆధునిక ఫ్యాషన్, సౌకర్యం, రోజువారీ వినియోగానికి అనుగుణంగా రూపొందించిన కలెక్షన్లను వినియోగదారులకు అందిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారుHyderabad City News.
హైదరాబాద్‌లో తొలి స్టోర్‌కు లభిస్తున్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని త్వరలోనే దేశంలోని ఇతర ప్రధాన నగరాలకు కూడా బ్రాండ్‌ను విస్తరించేందుకు కెల్లీ ఫెల్డర్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. భారత ఫ్యాషన్ మార్కెట్‌లో తమదైన శైలితో ముందుకు సాగేందుకు సంస్థ కార్యాచరణను ప్రారంభించింది.



