AP POLITICAL NEWS: జగన్ ది విధ్వంసం… మాది అభివృద్ధి

Karthik

ప్రపంచం మెచ్చేలా గ్రీన్ ఫీల్డ్ రాజధానిని సీఎం చంద్రబాబు నిర్మిస్తుండడం చూసి జగన్ ఓర్వలేకపోతున్నారని మంత్రి సవిత మండిపడ్డారు. జగన్ ది విధ్వంసం క్రెడిట్ అని, తమ ప్రభుత్వానికి అభివృద్ధి క్రెడిట్ అని అన్నారు. రప్పా రప్పా నరకడం, విధ్వంసం, దోపిడీ, అరాచకం ఇవి జగన్ క్రెడిట్ అని అన్నారు. ఆ క్రెడిట్ ను ఎవ్వరూ ఆశించరన్నారు. ప్రజలు ఛీ కొట్టడంతో ఇప్పుడు మావిగన్ అంటూ మరో డ్రామా ఆడుతున్నారన్నారు. మావిగన్ ఎక్కడుందో కూడా తెలియని అజ్ఞాని జగన్ అని విమర్శించారు. నిరసనల పేరుతో రాష్ట్రంలో జగన్, వైసీపీ నాయకులు విధ్వంసం సృష్టిస్తున్నారని మంత్రి సవిత మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Author
Share This Article
Leave a review