GUNTUR CITY NEWS: గుంటూరు పశ్చిమను ఆరోగ్యవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే లక్ష్యం: ఎమ్మెల్యే గళ్ళా మాధవి

Karthik

గుంటూరు పశ్చిమ నియోజకవర్గాన్ని ఆరోగ్యవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని ప్రతి కుటుంబం ఆరోగ్యంగా ఉండాలన్న సత్సంకల్పంతో ప్రతి వారం ఒక్కో డివిజన్ లో మెగా మెడికల్ క్యాంప్ కార్యక్రమాన్ని ఉద్యమంలా నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే గళ్ళా మాధవి పేర్కొన్నారు. ఆదివారం గుంటూరు పశ్చిమ నియోజకవర్గ 18వ డివిజన్ ప్రజల ఆరోగ్య రక్షణ కోసం గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి ఆధ్వర్యంలో, శ్రీ భ్రమర ట్రస్ట్ సహకారంతో వికాస్ హాస్పిటల్స్ నిర్వహిస్తున్న ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే గళ్ళా మాధవి, భ్రమర టౌన్ షిప్స్ అధినేత గళ్ళా రామచంద్రరావు సందర్శించి ప్రజలతో మమేకమయ్యారు. ఈ మెగా వైద్య శిబిరంలో వందలాది మంది ప్రజలు పాల్గొని ఉచిత వైద్య సేవలను వినియోగించుకున్నారు. ఆర్థోపెడిక్స్, కార్డియాలజీ, వాస్కులర్ సర్జరీ, జనరల్ మెడిసిన్ తదితర విభాగాలకు చెందిన నిపుణులైన వైద్యులు ప్రజలకు పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గళ్ళా మాధవి మాట్లాడుతూ ఈ సంవత్సరం తాము “ఉద్యోగ కల్పన – ఆరోగ్యం” అనే రెండు ప్రధాన లక్ష్యాలతో ముందుకు సాగుతున్నామని, ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి డివిజన్‌లో వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే గళ్ళా మాధవి తెలిపారు.ఇప్పటికే గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో దాదాపు 70 ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించామని, వికాస్ హాస్పిటల్స్ సహకారంతో ఈ కార్యక్రమం నిర్విరామంగా కొనసాగుతోందన్నారు. ప్రజలకు ఉచిత వైద్య పరీక్షలు, ల్యాబ్ టెస్టులు, మందులు అందించడం ద్వారా ఆరోగ్య భద్రత కల్పిస్తున్నామని పేర్కొన్నారు. 400 మందికి పైగా పరీక్షలు – గుండె సమస్యలు గుర్తింపు ఈరోజు నిర్వహించిన శిబిరంలో ఇప్పటికే 400 మందికి పైగా వైద్య పరీక్షలు నిర్వహించారని ఎమ్మెల్యే తెలిపారు. ఈసీజీ పరీక్షల్లో కొందరికి గుండె సంబంధిత సమస్యలు గుర్తించబడటంతో వారిని వెంటనే హాస్పిటల్‌కు వచ్చి చికిత్స పొందాలని వైద్యులు సూచించినట్లు చెప్పారు.డయాబెటిస్, బీపీ, థైరాయిడ్ సమస్యలతో బాధపడుతున్న వారికి అక్కడికక్కడే ఉచిత మందులు అందించామని, వాస్కులర్ సమస్యలతో బాధపడుతున్న కొందరిని మెరుగైన చికిత్స కోసం ఆసుపత్రికి వచ్చి చికిత్స పొందాలని సూచించినట్లు వివరించారు. ప్రజలు ఆసుపత్రులకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ల్యాబ్ టెస్టులను కూడా శిబిరాల్లోనే ఉచితంగా నిర్వహించడం సంతోషకరమన్నారు.*ఒంటరి మహిళలకు భరోసా – LOC, CMRF సహాయం అందిస్తాం. శిబిరానికి వచ్చిన కొంతమంది ఒంటరి మహిళలు గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎమ్మెల్యే తెలిపారు. వారికి ఎన్టీఆర్ వైద్య సేవలు, అవసరమైతే LOC, CMRF ద్వారా సహాయం అందించి తక్షణ చికిత్స కల్పించే ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు.వికాస్ హాస్పిటల్స్ యాజమాన్యంతో కూడా మాట్లాడినట్లు, అవసరమైన వారికి సహకారం అందిస్తామని వారు ముందుకు వచ్చారని వెల్లడించారు. వికాస్ హాస్పిటల్స్ యాజమాన్యానికి ప్రత్యేక కృతజ్ఞతలు. ప్రజలకు సేవలందిస్తున్న వికాస్ హాస్పిటల్స్ డాక్టర్లు, సిబ్బంది, యాజమాన్యానికి, ఈ కార్యక్రమం విజయవంతం చేయటానికి సహకరించిన డివిజన్ టీడీపీ అధ్యక్షులు ఉల్లి గోపాల్ కృష్ణ,జనసేన సానం రమేష్,నిమ్మల రమణ, ఉప్పదల సాంబ మరియు బీజేపీ నారాయణ, నేతలకు ఎమ్మెల్యే గళ్ళా మాధవి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Author
Share This Article
Leave a review