“ఆపరేషన్ క్లీన్ స్వీప్” కార్యక్రమం ద్వారా గుంటూరు నగరాన్ని స్వచ్చ నగరంగా తీర్చిదిద్దుతకు ప్రణాళిక సిద్దం చేశామని గుంటూరు నగర కమిషనర్ కే. మయూర్ అశోక్ అన్నారు. “ఆపరేషన్ క్లీన్ స్వీప్” ద్వారా నగరంలోని పలు వార్డు సచివాలయాల పరిధిలో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు, ‘స్వర్ణాంధ్ర – స్వచ్చాంద్ర’ సాధనలో భాగంగా గుంటూరు నగరాన్నిపరిశుభ్ర నగరంగా తీర్చిదిద్దేందుకు “ఆపరేషన్ క్లీన్ స్వీప్” పేరుతొ నాలుగు వారాల ప్రత్యేక పారిశుధ్య కార్యాచరణను ఈ నెల 23వ తేదీ నుండి ప్రారంభించామని తెలిపారు . మే 25, 26 తేదీల్లో నగరంలోని 20 వార్డు సచివాలయాల పరిధిలో విస్తృత స్థాయిలో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించుట జరిగిందన్నారు. ముఖ్యంగా ప్రధాన రహదారులు, నగర ప్రవేశ మార్గాలు, వార్డు జంక్షన్‌లు, బ్యాక్ లైన్లు పూర్తిస్థాయిలో శుభ్రం చేయుట జరిగిందన్నారు. అదేవిధంగా గుర్తించిన 4 గార్బేజ్ వల్నరబుల్ పాయింట్లు (GVPs) పూర్తిగా క్లియర్ చేసి పరిశుభ్రంగా మార్చడం జరిగిందని తెలిపారు.అలాగే ఖాళీ స్థలాల్లో పేరుకుపోయిన చెత్త మరియు వ్యర్థాలను తొలగించేందుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించామని, ఈ కార్యక్రమంలో ఖాళీ స్థలాల నుండి 11 టన్నుల చెత్తను తొలగించగా, రోడ్డు మార్జిన్ల నుండి 3 టన్నులు, జంక్షన్ పాయింట్ల వద్ద నుండి 1 టన్ను చెత్తను తొలగించుట జరిగిందన్నారు. ఇప్పటివరకు మొత్తం 15 టన్నుల చెత్తను లిఫ్ట్ చేయడంతో పాటు, 64 కిలోమీటర్ల రహదారులను శుభ్రం చేసి ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించుట జరిగిందన్నారు. ఈ కార్యక్రమం విజయవంతం కావాలంటే ప్రజల భాగస్వామ్యం ఎంతో ముఖ్యమని వారి సహకారంతో గుంటూరు నగరానని స్వచ్చ నగరంగా తీర్చిదిద్దేందుకు నగర పాలక సంస్థ కట్టుబడి పనిచేస్తోందని తెలియచేశారు.
GUNTUR CITY NEWS: ఆపరేషన్ క్లీన్ స్వీప్ తో స్వచ్చ గుంటూరు సాధన

Sign Up For Daily Newsletter
Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Leave a review Leave a review
Stay Connected
Weather
33°C
Vijayawada
overcast clouds
33° _ 33°
38%
1 km/h
Wed
37 °C
Thu
34 °C
Fri
31 °C


