చిరంజీవి ఆనాడు ఆ తప్పు చేశారా? 🧐 2009 ఎన్నికలపై నాగేశ్వర్ సంచలన విశ్లేషణ! 💥

Bhuvana

): తెలుగు రాజకీయ చరిత్రలో 2009 ఎన్నికలు ఒక మలుపు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్, టీడీపీల మధ్య దశాబ్దాలుగా సాగుతున్న పోరును బద్దలు కొడుతూ మెగాస్టార్ చిరంజీవి ‘ప్రజారాజ్యం’తో అరంగేట్రం చేసిన సమయమది. ఆనాడు జరిగిన త్రిముఖ పోరులో వైఎస్సార్ నేతృత్వంలోని కాంగ్రెస్ వరుసగా రెండోసారి విజయం సాధించింది. అయితే, తాజాగా ఈ ఎన్నికల ఫలితాలపై ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసిన ఒక విశ్లేషణ ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఒకవేళ ఆనాడు సమీకరణాలు మారి ఉంటే.. రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం మరోలా ఉండేదా? అన్నదే ఇప్పుడు హాట్ టాపిక్.

2009లో వైఎస్సార్ హవాను తట్టుకునేందుకు చంద్రబాబు నాయుడు ‘మహాకూటెమి’ని ఏర్పాటు చేశారు. అందులో వామపక్షాలు (సీపీఐ, సీపీఎం) మరియు కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ భాగస్వాములుగా ఉన్నాయి. మరోవైపు చిరంజీవి ఒంటరిగా ‘సామాజిక తెలంగాణ’ నినాదంతో బరిలోకి దిగారు. ఓట్లు చీలిపోవడం వల్ల చివరకు కాంగ్రెస్ గెలుపొందింది. కానీ, ప్రొఫెసర్ నాగేశ్వర్ ఒక ఆసక్తికరమైన లాజిక్ తెరపైకి తెచ్చారు. ఆ ఎన్నికల్లో వామపక్షాలు టీడీపీ వైపు వెళ్లకుండా, కొత్తగా వచ్చిన ప్రజారాజ్యం పార్టీతో గనుక చేతులు కలిపి ఉంటే ఫలితాలు ఊహించని విధంగా ఉండేవని ఆయన అభిప్రాయపడ్డారు.

వామపక్షాలకు అప్పట్లో క్షేత్రస్థాయిలో బలమైన ఓటు బ్యాంక్ ఉండేది. ప్రజారాజ్యం పార్టీకి చిరంజీవి చరిష్మా, సామాజిక సమీకరణాలు తోడయ్యాయి. ఈ రెండు శక్తులు కలిస్తే.. ఆ కూటమికి ఒక బలమైన ‘థర్డ్ ఫోర్స్’ ఇమేజ్ వచ్చేదని, తద్వారా మధ్యస్థ ఓటర్లు భారీగా ఆకర్షితులయ్యే వారని నాగేశ్వర్ విశ్లేషించారు. వామపక్షాల కేడర్ మద్దతుతో చిరంజీవి పార్టీ మరిన్ని స్థానాలను గెలుచుకునే అవకాశం ఉండేదని, తద్వారా కాంగ్రెస్ అధికారాన్ని కోల్పోవడం గానీ, లేదా హంగ్ అసెంబ్లీ ఏర్పడటం గానీ జరిగి ఉండేదని ఆయన పేర్కొన్నారు. కేవలం పొత్తుల లెక్కలు తప్పు వల్లే చిరంజీవి పార్టీ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయిందనేది ఆయన విశ్లేషణ సారాంశం.

Author
Total Views: 0
Share This Article
Leave a review